Wednesday, 15 April 2020

లాక్‌డౌన్‌ మార్గదర్శకాల విడుదల*

*లాక్‌డౌన్‌ మార్గదర్శకాల విడుదల*

 లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
👉 ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి
👉 వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ
👉 అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ
👉సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేత
👉విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత
👉 మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం
👉 ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు యథాతథం

👉 పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
👉ఉపాధి హామీ పనులకు అనుమతి,
👉 అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి
👉 రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
👉 వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి
👉వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి
👉 విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి
👉 బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం
👉అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి
👉 రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి
👉ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ
👉గోదాములు, శీతల గోదాములకు అనుమతి
👉ఈ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి
👉వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి
👉ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి
👉గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి
👉బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు
👉బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి
👉భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు
👉ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం

0 comments:

Post a comment

Recent Posts