Friday, 15 May 2020

Important Events of May 16

Important Events of May 16
*చరిత్ర లో ఈరోజు*

🕐 *సంఘటనలు*🕐

👉 *1532*: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు.

👉 *1763*: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్ , మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.

👉 *1770* : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.

👉 *1801*: విలియం సెవార్డ్ , (రాష్ట్ర కార్యదర్శి) సెక్రటరీ అఫ్ స్టేట్ (అమెరికా), రష్యా నుండి అలస్కా ను 1867 లో 7.2 మిలియన్ డాలర్లకు కొన్నాడు. ఆ రోజుల్లోని, అమెరికా ప్రజలంతా, సెవార్డ్ పిచ్చి పనులు అనేవారు. యుద్ధతంత్ర రీత్యా,, అలాస్కా ప్రాముఖ్యత ఏమిటో నేటి అమెరిక ప్రజలకు తెలుసు.


👉 *1804*: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తి ప్రకటించింది.

👉 *1824*: లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు.

👉 *1831*: మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ హ్యుస్, జననం. (మ.1900)

👉 *1881*: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.

👉 *1929*: మొదటి అకాడమీ అవార్డులు, హాలీవుడ్ దగ్గర ఉన్న రూజ్వెల్ట్ హోటల్ లో ఒక విందు సమయంలో బహూకరించారు. వింగ్స్ సినిమా ఉత్తమచత్రం, ఎమిల్ జన్నింగ్స్ ఉత్తమ నటుడు, జానెట్ గేనర్ ఉత్తమ నటి.

👉 *1960*: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది

👉 *1969*: మానవరహిత సోవియట్ అంతరిక్ష నౌక వీనస్-5, శుక్రగ్రహం ఉపరితలంపై అడుగుపెట్టింది.

👉 *1975*: జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్, మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ.

👉 *1992*: స్పేస్ షటిల్ ఎండీవర్ తన మొదటి రోదసీ ప్రయాణం, సుఖంగా ప్రయాణించి, తిరిగి, కాలిఫోర్నియా ఎడారిలో సురక్షితంగా దిగింది..

👉 *1996*: భారత 11వ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.

👉 *1997*: రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) "

👉 *2006*: భారతదేశం అగ్ని-III బాలిస్టిక్ క్షిపణి యొక్క ప్రయోగ పరీక్షను, వాయిదా వేసింది.

👉 *2007*: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.

👉 *2007*: లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.

❣️ *జననాలు*❣️

👉 *1923*: డా. లింగం సూర్యనారాయణ, శస్త్రచికిత్స నిపుణులు.

👉 *1960*: సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత.

👉 *1978*: సొమా బిశ్వాస్, భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి.

💐 *మరణాలు* 💐

👉 *1830*: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (జ.1768)

👉 *1908*: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు

👉 *1950*: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914)

👉 *1999*: మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్‌) స్థాపకుడు.

👉 *2018*: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)

0 comments:

Post a comment

Recent Posts