Tuesday, 19 May 2020

Important Events of May 20

Important Events of May 20
🌎 *చరిత్రలో ఈరోజు
🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం*
[కొనుగోలుదారులు, వినియోగదారుల రక్షణ కోసం, వారిని మోసాల నుంచి కాపాడేందుకు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, పొందే సేవలు నాణ్యమైనవేనన్న నమ్మకం కలిగించడం]

🚩 *ప్రపంచ తేనెటీగల  రోజు*
[మే 20 1934లో తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథొన్ జంసా జన్మించారు. జీవావరణవ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తించుటే ఈ రోజు యొక్క ఉద్దేశ్యము.]

🚩 *తెలుగు కార్టునిస్టుల దినోత్సవం*
[వంగ్యచిత్రాలు అంటే ఇష్టపడని హాస్యప్రియులు ఉండరు. పుస్తకాల్ని చదివేవారికి హాస్యం అంటే ఇష్టపడే వారికి చురుక్కున మెరిసి, కిసిక్కున నవ్వించేదే వ్యంగ్యచిత్రం. తొలితెలుగు వ్యంగ్యచిత్రకారుడు తలిశెట్టి రామారావు జన్మదినం మే 20న. ఈరోజున ప్రతిఏటా తెలుగు వ్యంగ్యచిత్రకారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.]

🚩 1902: క్యూబా  గణతంత్రంగా ప్రకటితము.
🚩 1927: సౌదీ అరేబియా - గుర్తింపబడినది.
〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
✴1537: హీరోనిమస్ ఫాబ్రిసియస్ అబ్ ఆక్వాపెండెంటె, సర్జన్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త పుట్టాడు (మన శుశృతుడు లాగ.)
✴1609: థామస్ తోర్పె విలియం, షేక్స్పియర్ రచించిన సాన్నెట్ లను (ఇంగ్లీష్ భాషలో రచించే ప్రశ్న, జవాబుతో కూడిన పద్యము). ముద్రించాడు. బెంగాలీ రచయిత్రి తోరు దత్ ఈ సాన్నెట్లు రచించింది.
✴1830: మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్ ]], "బాల్టిమోర్ అమెరికన్" వార్తాపత్రిక లో, ప్రచురించబడింది
✴1902: అమెరికా, క్యూబా ఆక్రమణకు ముగింపు పలికింది.
✴1913: గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు.
✴1950: అమెరికాలో "సైనిక దళాల రోజు (ఆర్మ్ డ్ ఫోర్సె డే)]], నిజానికి "ఆర్మీ డే" 1950 నుండి మే మూడవ శనివారం జరుపుకుంటున్నారు.
✴1990: హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఛాయాచిత్రాలను భూమికి పంపింది.
✴1992 భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ప్రయోగించింది.
✴2008: తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
✴2010: యు ట్యూబ్, ఫేస్ బుక్ లను పాకిస్తాన్ నిషేధించింది.
✴2011: పశ్చిమ బెంగాల్‌లో 34ఏళ్ళ సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది.
✴2012: గుంటూరు జిల్లాలోని, రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి.
✴2012: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2012 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2012 మే 20 ఆదివారం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం,తిరుపతి నగరాల్లోని 101 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 48,178 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావచ్చును. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పరీక్ష జరిగింది.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1896: *అబ్బూరి రామకృష్ణారావు*, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది (మ.1979).
❇1913: *విలియం హ్యూలెట్*, హ్యూలెట్ పాకార్డ్ కంపెనీ సహ-స్థాపకుడు (మ.2001).
❇1915: *మోషే డయన్*, ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం (మ.1981).
❇❇1933: *జె. వి. రమణమూర్తి*, ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు (మ.2016).
❇1939: *బాలు మహేంద్ర*, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు (మ.2014).
❇1944: *దూడం నాంపల్లి*, అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు (మ.2013).
❇1955: *సిరివెన్నెల సీతారామశాస్త్రి*, తెలుగు సినీ గీతరచయిత.
❇1970: *పరిటాల సునీత*, ప్రస్తుతము రాప్తాడు నియోజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు, మంత్రిపదవి నిర్వహిస్తున్నారు.
❇1978: *పి.టి.ఉష*, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి.
❇1983: *జూనియర్ ఎన్.టి.ఆర్*, తెలుగు సినిమా నటుడు.
❇1984: *మంచు మనోజ్* కుమార్, తెలుగు సినిమా నటుడు.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1506: *క్రిష్టొఫర్ కొలంబస్*, అమెరికా ఖండాన్ని కనుగొన్న వ్యక్.తి. (జ.1451).
◾1932: *బిపిన్ చంద్ర పాల్*, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858).
◾1957: *టంగుటూరి ప్రకాశం పంతులు*, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి (జ.1872).
◾1989: *జాన్ రిచర్డ్ హిక్స్*, ప్రముఖ ఆర్థికవేత్త (జ.1904).
◾1994: *కాసు బ్రహ్మానందరెడ్డి*, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909)
◾1998: *ఫ్రాంక్ సినట్రా*, హాలీవుడ్ నటుడు (జ.1915).

0 comments:

Post a comment

Recent Posts