Wednesday, 27 May 2020

PECET- 2020 Detailed information

*🌺PECET- 2020🌺*

*🌺పీఈటీ పోస్టులకు తొలి మెట్టు పీఈసెట్*


*🌺ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) పీఈసెట్-2020 బాధ్యతలను చేపట్టింది.*

*🌺ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అవి-*

*🌺1. బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)*

*🌺కోర్సు వ్యవధి: రెండేళ్లు*

*🌺అర్హత: ఏదైనా డిగ్రీ*

*🌺ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*

*🌺వయసు: 19 ఏళ్లు (జులై 1 2020 నాటికి)*

*🌺2. డీపీఈడీ | యూజీ డీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)*

*🌺కోర్సు వ్యవధి: రెండేళ్లు*

*🌺అర్హత: ఇంటర్.*

*🌺చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.*

*🌺వయసు: 16 ఏళ్లు (జులై 1, 2020 నాటికి)*

*🌺ఎంపిక విధానం🌺*

*🌺రాత పరీక్ష ఉండదు.*

*🌺ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.*

*🌺బీపీఈడీ, డీపీఈడీ /యూజీ డీపీఈడీ రెండు కోర్సులకు ఈవెంట్స్ ఒకటే.*

*🌺ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్.*

*🌺ఈ రెండు విభాగాలకు కలిపి 500 మార్కులు కేటాయించారు.*

*🌺ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పోటీలను నిర్వహిస్తారు.*

*🌺అదనపు మార్కులు జాతీయ / అంతర్జాతీయ /ఇంటర్ యూనివర్సిటీ /స్కూల్ గేమ్స్ / ఇలా వివిధ స్థాయుల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఏదైనా కోర్సు లేదా యోగా, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం /ఒలింపిక్ ఎడ్యుకేషన్లలో ఏడాది డిప్లొమా కోర్సు చేసిన వారికి లేదా ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్ ఉన్న వారికి అదనంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.*

*🌺ముఖ్య సమాచారం🌺*

*🌺దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా*

*రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 850 (ఎస్సీ / ఎస్టీలకు రూ. 650)*

*🌺దరఖాస్తుకు చివరి తేదీ. 15 జూన్ 2020*

*🌺రూ. 500 అపరాధ రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 25 జులై 2020*

*🌺వెబ్సైట్  https://sche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx


*🌺ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్*

*🌺ఈ విభాగానికి 400 మార్కులు కేటాయించారు.*

*🌺ఇందులో పురుష అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్🌺*

*🌺మార్కులు: 100 మీటర్ల రన్ (100 మార్కులు),*

*🌺షాట్‌పుట్ - 6 కిలోలు (100 మార్కులు),*

*🌺800 మీటర్ల రన్ (100 మార్కులు),*

*🌺లాంగ్ / హైజంప్ (100 మార్కులు),*

*🌺మహిళ అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్ మార్కులు🌺*

*🌺100 మీటర్ల రన్ (100 మార్కులు),*

*🌺షాట్‌ప్పు - 4 కిలోలు (100 మార్కులు),*

*🌺400 మీటర్ల రన్ (100 మార్కులు),*

*🌺లాంగ్ / హైజంప్ (100మార్కులు).*

*🌺స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్🌺*

*🌺ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు.*

*🌺ఇందులో నిర్దేశించిన జాబితాల్లోంచి ఏదో ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలి. అందులో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించి మార్కులు ఇస్తారు.*

*🌺అయితే విద్యార్థులు దరఖాస్తులోనే తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాన్ని పేర్కొనాలి.*

*🌺ఒక వేళ ఆ విషయాన్ని విస్మరిస్తే ఎంపిక ప్రక్రియకు అనుమతించరు.🌺*

*🌺ఇందులో 11 క్రీడాంశాలు ఉంటాయి. అవి.. బాస్కెట్ బాల్, వాలీబాల్, హాకీ, టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, షటిల్ బ్యాడ్మింటన్*

*🌺సీట్ల కేటాయింపు మెరిట్ లిస్ట్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు.*

*🌺ప్రతి మెథడాలజీలో 85 శాతం సీట్లు స్థానికులకు ఉంటాయి. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలోకి వస్తాయి.*

*🌺తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ, ఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ - గోపన్నపాలెం (తూర్పుగోదావరి), రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు (కడప) స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లు.*


*🌺వీటిల్లో 85 శాతం సీట్లను ఆంధ్రా, ఉస్మానియా శ్రీవేంకటేశ్వర, యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు 42.36:22 నిష్పత్తిలో సీట్లను కేటాయిస్తారు. మిగతా 15శాతం అన్ రిజర్వుడ్  కోటాలో ఉంటాయి. వీటికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విద్యార్థులు పోటీ పడొచ్చు.*

0 comments:

Post a comment

Recent Posts