Sunday, 7 June 2020

Important Events on June 06

🌎 *చరిత్రలో ఈ రోజు*

🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *స్వీడన్ జాతీయదినోత్సవం.*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1515: శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.
✴1674: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కి పట్టాభిషేకం జరిగిన రోజు.
✴1928 : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు మొదటి ప్రచురణ జేమ్స్ ముర్రే సంపాదకత్వంలో వెలువడింది.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*

❇1699: అజీజుద్దీన్ అలంఘీర్, మొఘల్ చక్రవర్తి. (మ.1759)
❇1799: ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ జననం (మ.1837).
❇1877: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (మ.1949)
❇1890: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
❇1891: ప్రముఖ కన్నడ రచయిత మాస్తి వెంకటేశ అయ్యంగార్ జననం (మ.1986).
❇1902: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
❇1909: చోడగం అమ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు (మ.1999).
❇1915: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994)
❇1915: విక్రాల శేషాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
❇1929: సునీల్ దత్, భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005)
❇1936: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
❇1946: అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
❇1947: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (మ.1988)
❇1956: జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
❇1976: జ్యోతిరాణి. జి, రంగస్థల నటి.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1897: కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816)
◾1897: కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852)
◾1976: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902)
◾1979: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (జ.1912)
◾1986: ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మాస్తి వెంకటేశ అయ్యంగార్ మరణం (జ.1891).
◾2001: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
◾2015: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984).

0 comments:

Post a comment

Recent Posts