AP Latest Updates

Academic Exam Papers

AP GOs

Current Affairs

TS GOs

Wednesday, 21 June 2023

హైబీపీతో బాధపడుతున్నారా?.. ఇవి తింటే ఈజీగా తగ్గిపోతుంది!

హైబీపీతో బాధపడుతున్నారా?.. ఇవి తింటే ఈజీగా తగ్గిపోతుంది!

High BP Control Food : ఇటీవల చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారానే హైబీపీని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.


 హైబీపీని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

High Blood Pressure Foods to Avoid : ఆధునిక జీవితంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల్లో ఒత్తిడి, కుటుంబ సమస్యలతో చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగ, వ్యాపార పనుల్లో చాలామంది తీరిక లేకుండా గడుపుతూ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవడమే మానేశారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం వల్ల అధిక రక్తపోటుకు గురవుతున్నారు.



High BP Control Food : ఇటీవల చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అధిక రక్తపోటు శరీరంలోని అవయవాలు, దాని విధులకు హాని కలిగిస్తుంది. దీని వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశముంటుంది. అందుకే బీపీ స్థాయిలను అదుపులో ఉంచుకోవడమనేది చాలా ముఖ్యం. అధిక రక్తపోటును నియంత్రించి తక్కువ బీపీ స్థాయిలను కలిగి ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరల వల్ల అదుపులో బీపీ
ఆకుకూరల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇక టమాటాలు, బంగాళదుంపలు, బీట్‌రూట్, చిలగడ దుంపలు, వెల్లుల్లి, పుచ్చకాయలు, అరటిపండ్లు, అవకాడోలు, కివి, బెర్రీలు, నారింజ, ఆప్రికాట్ వంటి వాటిల్లో లైకోపీన్, పొటాషియం, నైట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్ సి, ఆంథోసైనిక్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును  తగ్గించడంలో సహాయపడతాయి.


బీన్స్‌తో బీపీకి చెక్
బీన్స్, పప్పులు, కాయ ధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషక విలువలు చాలా లభిస్తాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగుపర్చి అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి నట్స్‌లలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్తపోటును తగ్గిస్తాయి.

తృణధాన్యాలతో ఉపయోగాలెన్నో..
రోల్డ్ ఓట్స్‌లలో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ప్యాకింగ్, ప్రాసెస్, శుద్ధి చేసిన ఆహార పదార్థాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

కెఫిన్ తగ్గించండి
Foods For High Blood Pressure : కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. కెఫిన్ తీసుకోవడం వల్ల విడుదలయ్యే ఆడ్రినలిన్ అనే పదార్థం రక్తపోటును మరింత పెంచుతుంది.

చల్లని నీటితో స్నానం
High BP Home Remedies : నిద్రపోయే ముందు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడమే కాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది. రాత్రి నిద్ర రక్తపోటుతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రోజూ వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం లాంటివి చేయడం, ఒత్తిడికి గురి కాకుండా పాటలు వినడం వల్ల అధిక రక్తపోటును తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Sunday, 18 June 2023

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే


ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 



ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అలాగే ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని తెలిపింది. 

ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.


Saturday, 17 June 2023

ఈ LED బల్బుల రూ.100 లోపే.. సూపర్ లైటింగ్.. కరెంటు ఆదా... ఆఫర్‌లో కొనేయండి!

ఈ LED బల్బుల రూ.100 లోపే.. సూపర్ లైటింగ్.. కరెంటు ఆదా... ఆఫర్‌లో కొనేయండి!

Eveready Base B22D 7-Watt LED Bulb : కస్టమర్లు ప్రస్తుతం ఈ బల్బును అమెజాన్ నుంచి రూ.84కి కొనుగోలు చేయవచ్చు.


 ఈ బల్బ్ 7W. దీని ప్రకాశం 700 ల్యూమెన్. ఇది 14W CFL బల్బుకి సమానం. (Image- Amazon)


Syska Led Bulb 7 Watt : కస్టమర్లు ప్రస్తుతం ఈ బల్బును అమెజాన్ నుంచి రూ.99కి కొనుగోలు చేయవచ్చు. ఇది 7W శక్తి సామర్థ్యం గల బల్బ్. దీనితో వినియోగదారులకు 2 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. (Image- Amazon)


Wipro 9W LED Warm White Bulb (N90002) : కస్టమర్లు ప్రస్తుతం ఈ బల్బును అమెజాన్ నుంచి రూ.100కి కొనుగోలు చేయవచ్చు. ఇది 9W బల్బ్, ఇది 15 వాట్ల CFLకి సమానం. దీని ప్రకాశం 800 ల్యూమెన్. (Image- Amazon)


wipro Garnet N90001 B22D LED Bulb : కస్టమర్లు ఇప్పుడు ఈ బల్బును అమెజాన్ నుండి రూ.100కి అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది 9W బల్బ్. ఇది 840 ల్యూమెన్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది 15 వాట్ల CFL బల్బుకు సమానం. (Image- Amazon)


Saturday, 6 May 2023

AP Model School 6th Class Admission 2023 Notification Application Schedule

AP Model School 6th Class Admission 2023 Notification Application Schedule

 ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశం కొరకు ప్రకటన*

2023-24 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో చేర్చుకొనుటకై 11/06/2023(ఆదివారం) నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.


*ప్రవేశ అర్హత* : 

1.  2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది వుండాలి.

2. *వయస్సు*: 

OBC - 01/09/2011 -31/8/2013 మధ్య పుట్టి వుండాలి.

SC,ST - 01/09/2009 -31/08/2013 మధ్య పుట్టి వుండాలి.



3. *ప్రవేశ పరీక్ష* :

🗓️ప్రవేశ పరీక్ష తేది: 11/06/2023

🕙సమయం: ఉ. 10.00 గం. - ఉ.12 గం.

🏢Venue: సంభందిత మోడల్ స్కూల్

📝పరీక్ష మీడియం: తెలుగు/ఇంగ్లిష్ 


ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులు కింది విధంగా సాధించాలి.

*OC,BC విద్యార్థులు - 35* మార్కులు

*SC,ST విద్యార్థులు - 30 మార్కులు*



*దరఖాస్తు చేయు విధానము*:

www.cse.ap.gov.in ద్వారా (online లో) ఏదేని నెట్ సెంటర్ లో చేసుకోవాలి.


*పరీక్ష రుసుము*:

OC,BC - RS.150/-

SC,ST - RS. 75/-


*Tentative schedule*

1. రుసుము చెల్లించడం: 09/05/2023 నుంచి


2. అప్లికేషన్స్ స్వీకరణ తేదీ: 10/05/2023 నుంచి


3. రుసుము చెల్లించుటకు ఆఖరు తేదీ : 25/05/2023


4. ప్రవేశ పరీక్ష తేదీ : 11/06/2023


Click here to Download Admission Notification

Click here to Download Application Form

Download Press Note for Admission

Friday, 5 May 2023

AP SSC Results 2023 Download

 AP SSC Results 2023 Download

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాల (AP Tenth Results 2023) విడుదల ఎప్పుడనే ఉత్కంఠకు తెరపడింది.


ఫలితాల విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్వయంగా ప్రకటించారు. రేపు అంటే.. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను https://www.bse.ap.gov.in/లో చూడొచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1) https://www.bse.ap.gov.in/ దీనిపై క్లిక్ చేయండి
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

SSC PUBLIC EXAMS 2023 - SCHOOL WISE RESULT LINK: Open Below Link

SCHOOL LOGIN DIRECT LINK CLICK HERE

https://www.bse.ap.gov.in/apsscadmissions/Account/Login.aspx

Click the Below Links to Check SSC Results


http://results.bse.ap.gov.in    

http://results.eenadu.net/

www.eenadu.net

https://pratibha.eenadu.net/

https://bse.ap.gov.in/

https://resultsbse.ap.gov.in/

https://resultsbie.ap.gov.in/

http://www.manabadi.co.in/

Wednesday, 29 March 2023

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?


మనలో చాలామందికి ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు, మైకం కమ్మినట్లు కొద్ది క్షణాలు అనిపిస్తుంటుంది. కాసేపటి తర్వాత తిరిగి మామూలైపోతుంటుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకోరు.

కానీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించే వాళ్లు మాత్రం అసలు ఇలా ఎందుకు జరుగుతోందని మదనపడుతుంటారు. ఇలా మైకం రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.చాలాసేపు ఒకే చోట కూర్చొని హఠాత్తుగా లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంటుంది. కొంతమందికి నడుస్తున్న సమయంలో లేదంటే వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.



 అసలు మైకం కలిగిన భావన లేదంటే కళ్లు తిరిగినట్లు ఎందుకు అనిపిస్తుంది. దాని వెనక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం.

మన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుంది. మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. 

ఉదాహరణకు కొందరికి కూల్ డ్రింక్ తాగినా లేదంటే ఐస్ క్రీం తిన్నా తలనొప్పి మొదలవుతుంటుంది. నిజానికి అంతకుముందు వరకు వాళ్లకు తలనొప్పి లేకపోయినా తమ శరీరానికి తగని ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది మొదలవుతుంది.

చాలామంది తమ పనులు చేసుకుంటున్న క్రమంలో మైకం కమ్మిన భావనను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వర్కవుట్ చేయడం, తగిన పోషకాహారం తినకపోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, తగినంత నీరు లేకపోవడం, శరీరం వేడెక్కడం లాంటి ఇతర కారణాల వల్ల మైకం కమ్మడం లేదంటే తల తిరగడం, కళ్లు తిరగడం జరుగుతుంటాయి. ఈ కారణాల గురించి మరింత తెలుసుకుందాం.


వర్కవుట్ కారణం కావచ్చు:
చాలామంది అథ్లెట్లు ఎక్కువగా వర్కవుట్ చేస్తుంటారు. వారి కెరీర్ కోసం వాళ్లు అలా చేస్తుండగా దీని వల్ల గుండె పనితీరులో మార్పు వస్తుంది. ఈ సమయంలో గుండె బలంగా మారి తక్కువ హృదయ స్పందనల్లో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తోంది. గుండె బలపడటం వల్ల ఇలా జరగ్గా వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెకు ఒక్కసారిగా విశ్రాంతి లభించడం వల్ల మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.

తగినంత తినకపోవడం కారణం కావచ్చు:
కొంతమంది రకరకాల కారణాల వల్ల తగినంత ఆహారాన్ని తినకుండా.. జ్యూస్​లతో కాలం వెల్లదీస్తుంటారు. దీని వల్ల శరీరంలో చక్కెరల స్థాయి పడిపోయి మైకం కమ్మినట్లు అనిపిస్తుంటుంది. కాబట్టి భోజనాన్ని మిస్ కాకుండా చూసుకోవడమే కాకుండా స్నాక్స్ కూడా తీసుకోవడం ఉత్తమం.

బ్లడ్ ప్రెషర్ నెమ్మదించడం:
మన శరీరంలో క్షణాల వ్యవధిలో మెదడు నుంచి కాళ్ల వరకు రక్తం పారుతుంది. అయితే మన శరీరంలో నరాల వ్యవస్థ కొన్నిసార్లు నెమ్మదిగా స్పందిస్తే రక్త ప్రవాహంలో మార్పు కలుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్​లో మార్పు రావడం వల్ల మైకం కమ్మినట్లు భావన కలుగుతుంది.

తగినంత నీటిని తీసుకోకపోవడం:
మనలో చాలామంది డీహైడ్రేట్ అయినా కూడా పట్టించుకోరు. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే మైకం కమ్మిన భావన కలుగుతుంది. కాబట్టి శరీరానికి ఏదో ఒక రూపంలో తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

శరీరం వేడెక్కడం:
వర్కవుట్ వల్ల లేదంటే వేడి పరిస్థితుల వల్ల కొన్నిసార్లు శరీరం వేడెక్కుతుంది. ఇది కూడా మైకం రావడానికి కారణం కావచ్చు. వర్కవుట్ చేసేటప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుందని చూసుకోండి. అలాగే వేడి వాతావరణంలో మీ శరీరం గురించి పట్టించుకోవడం మంచిది.


లోపలి చెవి సమస్య కారణం కావచ్చు:
కొన్నిసార్లు లోపలి చెవితో ఏదైనా సమస్య ఏర్పడినా కూడా మైకం వస్తుంది. నిజానికి మైకం రావడం వల్ల అనారోగ్య సమస్య ఉన్నట్లు కాదు. కానీ మైకంతో పాటు వేరే ఏదైనా అనుభూతి చెందితే మాత్రం అందుకోసం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే


Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే


అధిక వేడిని శరీరం తట్టుకోలేక వడదెబ్బ బారిన పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గి, డీహైడ్రేషన్ బారిన పడడం వల్ల వడదెబ్బ కలుగుతుంది. 

బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు శరీరం తనలోని వేడిని నియంత్రించుకోలేక విఫలమవుతుంది.



అలాంటి సమయంలోనే వడదెబ్బలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే ప్రథమ చికిత్స చేస్తే వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చు.

వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన వెంటనే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఒక్కోసారి 104° ఫారెన్ హీట్ దాటుతుంది. అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. 

గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా లేదా తక్కువగా తీసుకోవడ, రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, చెమట పట్టకపోవడం, వికారం, వాంతులు కావడం, స్పృహ కోల్పోవడం వంటివన్నీ జరుగుతాయి. వడదెబ్బ తగిలిన వెంటనే ప్రాథమిక చికిత్సను అందిస్తే వారిని కాపాడుకోవచ్చు.

ప్రథమ చికిత్స ఇలా...
వడదెబ్బ తగిలిన రోగిని చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. అలా శరీరం అంతా తుడుస్తూ ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు వచ్చే వరకు అలా చల్లని నీటితో వస్త్రంతో తుడుస్తూ ఉండాలి. చల్లని పానీయాలను అందించాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. 

గాలి తగిలేచోట ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ వాటర్ లో కాస్త ఉప్పు కలిపి తాగించడం మంచిది. ఓఆర్ఎస్ అందుబాటులో ఉంటే దాన్ని తాగిస్తే ఎంతో మేలు.

 ఈ పనులు చేస్తూనే మరోపక్క ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేయాలి. ఎందుకంటే కొంతమందిలో వడదెబ్బ తీవ్రంగా కొడితే ప్రాణానికే ప్రమాదం కావచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండలు పెరిగిపోతున్న ఈ కాలంలో వడదెబ్బ కొట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బయట ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో ఎక్కువసేపు ఎండకు గురవ్వకపోవడమే మంచిది. 

బయటికి వెళ్లే ముందు చల్లని పానీయాలు తాగి వెళ్లాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. మద్యాన్ని పూర్తిగా మానేయాలి. లేత రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి. అవి వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం అన్ని విధాలా మంచిది.

ఎండలు పెరుగుతున్నప్పటినుంచి రోజూ మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. వడదెబ్బను తట్టుకునే శక్తిని పానీయాలు అందిస్తాయి. చల్లని పానీయాలు, మజ్జిగ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పడిపోకుండా ఉంటాయి. 

వేసవిలో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం మంచిది. దాహాన్ని పెంచేసే మాంసాహారాన్ని, మసాలా నిండిన ఫుడ్కు, స్పైసీ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Recent Posts