Ensure that your logout attendance is marked without fail. mandatory to mark your attendance daily through eHazar.
పాఠశాల విద్యాశాఖలో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం ప్రస్తుతం ఉపాధ్యాయుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు అయిన తరువాత తమ హాజరును నమోదు చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నట్లయితే కాసేపాగి ప్రయత్నం చేసి తమ హాజరును నమోదు చేస్తున్నారు ఇలా హాజరు నమోదు లో కొంతవరకు ఆలస్యమైతే అధికారులు సంజాయిషీ అడుగుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు పాఠశాల పూర్తి అయిన తర్వాత కూడా తప్పనిసరిగా హాజరును నమోదు చేయాలని అధికారులను నుండి సందేశాలు అందుతున్నాయి. పాఠశాల పూర్తి అయిన తర్వాత సాంకేతిక లోపాలు తలెత్తితే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వేచి చూసి హాజరును నమోదు చేసే సరికి చాలా సమయం వృధా అయిపోతుంది. ఇలా సాంకేతిక సమస్యలు ఉదయం సమయంలో ఏర్పడినట్లయితే పాఠశాలల్లో నే ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి సమస్య పరిష్కారం అయిన తర్వాత హాజరును నమోదు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో కూడా ఇలా హాజరును నమోదు చేయడం తప్పనిసరి చేయడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ముందు సాంకేతిక సమస్యలు రాని వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఈరోజు సాంకేతిక సమస్యల వల్ల సాయంత్రం హాజరును క్లోజ్ చేయని ఒక ఉపాధ్యాయుడు అందుకున్న సందేశం.
"Dear Staff, It is observed that your logout attendance through eHazar was not marked on today till 04.30.00 PM. Ensure that your logout attendance is marked without fail. Apply your leave through APTeLS if you are on leave. Please give your attendance a top priority. It is mandatory to mark your attendance daily through eHazar. Please ignore this message if you have already marked your logout attendance. CSE, AP"
0 comments:
Post a Comment