Monday, 26 November 2018

జవహర్‌ నవోదయలో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల చివరి తేదీ 30.11.2018

*✨ ‘నవోదయ’లో ప్రవేశాలకు దరఖాస్తులు*
★ వేలేరు జవహర్‌ నవోదయలో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

★ ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం వేలేరు నవోదయ ప్రిన్సిపల్‌ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు.
★ 3, 4, 5 తరగతులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి, మే 1, 2006 నుంచి ఏప్రిల్‌ 30, 2010 మధ్య జన్మించి ఉండాలన్నారు.
★ www.navodaya.gov.in,  www.jnvkrishna.org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేయడంలో సందేహాలు ఉంటే నవోదయ పాఠశాలలోని సేవా కేంద్రం ద్వారా పూర్తి చేయాలని సూచించారు.

ఆన్లైన్ లో ఈనెల(నవంబర్) 30తో నవోదయ-2019 దరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి  5వ తరగతి(ప్రస్తుతం) చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ఈ విషయాన్ని పిల్లలు, లేదా మీ చుట్టూ ప్రక్కల పిల్లకు తెలియజేసి వారిని నవోదయకు ధరఖాస్తు చేసేలా తోడ్పడండి.
*🔅 దరఖాస్తు చేయుటకు కావలసినవి...స్కాన్ చేయవలసినవి(10 kb-100kb*
1. దరఖాస్తు సర్టిఫికెట్
2. విద్యార్థి సంతకం
3. విద్యార్థి తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకురాలి సంతకం.
4. విద్యార్థి ఫోటో....
*🔅 గమనిక:*
వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తరువాత దరఖాస్తులోని వివరాలను నమోదు చేసేటప్పుడు విద్యార్థి యొక్క ఆధార్ నెంబరును తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది..

*స్కాన్ చేయవలసిన  సర్టిఫికెట్ ప్రొఫార్మా(PDF).
*✨ నవోదయకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయు విధానం ఇలా..*
★ జవహర్‌ నవోదయ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేయడం కష్టసాధ్యంగా మారింది.
★ ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదుకు ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు.
★ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అవసరమై దరఖాస్తు చేయాలంటే  ఆన్‌లైన్‌లో మూడు విడతలుగా ప్రక్రియ నిర్వహించాలి.
★ తొలుత విద్యార్థి తన వివరాలు నమోదు చేయాలి. ఆతరువాత ఈ వివరాల ఆధారంగా దరఖాస్తుచేయాలి. ఆఖరున దరఖాస్తు ప్రతిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 *🍥 తొలి దశ ఇలా*
★ విద్యార్థి తొలుత జవహర్‌ నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష వెబ్‌ పోర్టల్‌ను తెరవాలి. అందులో విద్యార్థి పేరు, రాష్ట్రం, జిల్లా, బ్లాకు(సమితి), పాఠశాల పేరు, పుట్టిన తేది, చరవాణి సంఖ్యను నమోదు చేయాలి.
★ అప్పుడు ఈ విద్యార్థి సంఖ్య నమోదవుతోంది. దీంతో నమోదు సంఖ్య వస్తోంది. దీని తరువాత విద్యార్థి పుట్టిన తేదీ పాస్‌వర్డ్‌గా చేసుకోవాలని సందేశం వస్తోంది. దీంతో తొలి దశ పూర్తవుతోంది.
★ విద్యార్థి తనకు లభించిన పాస్‌వర్డ్‌ ఆధారంగా తిరిగి నవోదయ ప్రవేశ పరీక్ష వెబ్‌ పోర్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థి తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి గుర్తింపు చిహ్నం, కులం, వైవాహిక స్థితి, లింగం, భాష, చిరునామా వివరాలను నమోదు చేయాలి.
★ వీటికన్నా ముందుగా  ఇప్పటి వరకు విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణ పత్రం, విద్యార్థి పాస్‌పోర్టు సైజు ఫొటో, తల్లిదండ్రుల సంతకం స్కాన్‌ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిని కూడా నమోదు చేయాలి.
★ ఈవివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకుని సేవ్‌ చేసుకోవాలి. తరువాత విద్యార్థి మూడు నుంచి అయిదో తరగతి వరకు విద్యాభ్యాసానికి చెందిన వివరాలను నమోదు చేయాలి.
★ దరఖాస్తు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. దీన్ని నిర్థారించుకుని దరఖాస్తును సబ్‌మిట్‌ చేయాలి.
★ ఇది పూర్తయిన తరువాత విద్యార్థి తన దరఖాస్తు నకలు ప్రతిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అక్కడితో విద్యార్థి దరఖాస్తు చేయడం పూర్తవుతుంది.

ONLINE APPLICATION FOR ADMISSION TOCLASS VI (2019-20)

0 comments:

Post a Comment

Recent Posts