Thursday 1 November 2018

AP SA 1 2018 Exam Dates TimeTable



*✨సంగ్రహణాత్మకానికి సిద్ధం*12 నుంచి 29 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు*
★ ఈ విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలో వివరణాత్మక విధానంలో ఎస్‌ఏ-1 పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందుకు ఇప్పటికే పరీక్ష పత్రాల తయారీకి సబ్జెక్టు నిపుణులతో విజయవాడలో కార్యశాల నిర్వహించారు. ప్రస్తుతం వివరణాత్మకతతో పాటు బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రతి పరీక్షకు బిట్‌ పేపరు ఉంటుంది.
★ పదో తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ సరఫరా చేస్తుండగా, 1 నుంచి 9వ తరగతి వరకు డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్ష నిర్వహణ సంస్థ) సరఫరా చేస్తోంది. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు మూల్యాంకనం ఉంటుంది.
ప్రాథమిక పాఠశాలలకు..

★ 22న తెలుగు, 24న ఆంగ్లం, 26న గణితం, 27న పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో 50 మార్కులకు, పరీక్ష సమయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.

*🔅 పదో తరగతికి మూల్యాంకనంలో మార్పు..*
★ పదో తరతిలో పబ్లిక్‌ పరీక్ష పత్రం 80 మార్కులకే ఉండగా, మిగిలిన 20 అంతర్గత మార్కులుంటాయి.
గత ఏడాది విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది.
★ కొత్త విధానం ప్రకారం నాలుగు ఫార్మేటివ్‌లు 200 మార్కులను పది శాతానికి కుదిస్తారు. మిగతా పది శాతం మార్కులు ఎస్‌ఏ-1 మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-1 మార్కులకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
★ 18 రోజుల పాటు పరీక్షలు
ఈనెల 12 నుంచి 29 వరకు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
★ 6, 7, 8 తరగతులకు ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు, 9, 10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
*🔅 కాలపట్టిక..*

▪12న ఓరియంటల్‌ భాష (సంస్కృతం, ఒరియా, పర్షియా) పేపరు-1
▪13న వృత్తివిద్య పేపరు-2)
▪15న ప్రథమ భాష పేపరు-1
▪16న తెలుగు ‌్ర 17న హిందీ
▪19న ఆంగ్లం-1
▪20న ఆంగ్లం-2
▪ 22న గణితం-1
▪24న గణితం-2
▪ 26న భౌతికశాస్త్రం
▪ 27న జీవశాస్త్రం
▪28న సాంఘికశాస్త్రం-1
▪ 29న సాంఘికశాస్త్రం-2

0 comments:

Post a Comment

Recent Posts