Sunday, 30 December 2018

APPSC 2018: అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

ఏపీ లెజిస్లేచ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 2 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22 లోగా ఫీజు చెల్లించి, 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు రెండంచెల రాతపరీక్షల ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.

APPSC 2018: అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులు  భ‌ర్తీకి  ద‌ర‌ఖాస్తులు

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ. తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. జ‌ర్న‌లిజం లేదా తెలుగు పుస్త‌క ర‌చ‌న‌లో అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వ‌యోపరిమితి: 01.07.2018 నాటికి 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం 6 నెలల సర్వీసు ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.


ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌/ ప్రిలిమిన‌రీ పరీక్ష, మెయిన్ పరీక్ష ద్వారా.

 APPSC 2018: అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులు  భ‌ర్తీకి  ద‌ర‌ఖాస్తులు పరీక్ష స్వరూపం


ముఖ్యమైన తేదీలు.. 

✶ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 02.01.2019.

✶ ఫీజు చెల్లింపు చివ‌రితేది: 22.01.2019.

✶ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 23.01.2019.

✶ మెయిన్ పరీక్ష తేది: 25.04.2019.
Get to Download Complete Notification
For Online Application Submission of Notifications - Click Here
For Onetime Profile Registration - Click Here

0 comments:

Post a Comment

Recent Posts