Sunday, 30 December 2018

APPSC Jobs 2019: ఏపీలో అసిస్టెంట్ పీఆర్‌వో పోస్టులు

APPSC Jobs 2019: ఏపీలో అసిస్టెంట్ పీఆర్‌వో పోస్టులు

     

     అభ్యర్థులు జనవరి 2 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22 లోగా ఫీజు చెల్లించి, 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ స‌బార్డినేట్ స‌ర్వీస్‌లో అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్‌ (ఏపీఆర్‌వో) పోస్టుల భ‌ర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 2 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22 లోగా ఫీజు చెల్లించి, 23 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఖాళీలను భర్తీ చేస్తారు.

* అసిస్టెంట్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్స్: 15 పోస్టులు జోన్ల వారీగా ఖాళీలు..


  • జోన్‌-1        02
  • జోన్‌-2       04
  • జోన్‌-3       04     
  • జోన్‌-4         05
  • మొత్తం ఖాళీలు (పాతవి-03, కొత్తవి-12)15

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు జ‌ర్న‌లిజం/ ప‌బ్లిక్ రిలేష‌న్స్‌ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
వ‌యోపరిమితి: 01.07.2018 నాటికి 18 - 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ప్రభుత్వ సర్వీసుల్లో కనీసం 6 నెలల సర్వీసు ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.80. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌/ ప్రిలిమిన‌రీ ఎగ్జామినేష‌న్, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఓర‌ల్ టెస్ట్ (ఇంట‌ర్వ్యూ) ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం02.01.2019ఫీజు చెల్లించడానికి చివ‌రితేది22.01.2019ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది23.01.2019మెయిన్ ఎగ్జామినేష‌న్ తేది17.04.2019

Click here to Download Notification
For Online Application Submission of Notifications - Click Here
For Onetime Profile Registration - Click Here



0 comments:

Post a Comment

Recent Posts