Saturday, 1 December 2018

AP Tegalu Study Material For All Competitive Exams In Telugu Pdf

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న ఆవాసాలు (గ్రామాల కంటే చిన్నవి) ఎక్కువ.

ఒక్కో పంచాయతీ పరిధిలో ఇలా అనేక ఆవాసాలు ఉంటాయి.ఈ ఆవాసాలకు గ్రామ పంచాయతి హోదా కల్పించడంతోపాటు స్వీయ నియంత్రణ హక్కుల్ని కల్పిస్తారు.

ఆదివాసి కులాలు
1.గోండు (రాజ్ గోండ్, కోయుతూర్) 2.కోలం 3.ప్రధాన్ 4.తోటి 5.ఆంద్ 6.మన్నెవార్ 7.చెంచు 8.నాయకపోడు 9.కోయ 10. మొత్తం 32 తెగలు

చెంచులు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 3వ కులం. హరిదాసులు, బుడబుక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు విస్తరించి, అటు నిజాం రాజ్యానికీ, యిటు బ్రిటిషు పరిపాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ‌కి సరిహద్దుగా ఉన్నకృష్ణానదికి ఇరువైపులా వున్న ప్రాంతాల్లో కనిపించేవారు. 

Click here to Download Telugu Pdf

0 comments:

Post a Comment

Recent Posts