Monday 24 December 2018

TEACHER RECRUITMENT ( TRT and TETcumTRT ) - 2018 Initial Keys for 24-12-2018 A.M and P. M Sessions

AP DSC Intial Key held on 24.12.2018 Morning Session and afternoon Session


🍎డీఎస్సీ పరీక్షలు ప్రారంభం ఎస్‌ఏ పరీక్షలకు 89.35% హాజరు నేడు వెబ్‌సైట్లో ప్రాథమిక కీ: కమిషనర్‌
తిరుపతి కేంద్రంలో మంత్రి గంటా
 డీఎస్సీ-2018 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)(గణితం, బయోలాజికల్‌ సైన్స్‌) పరీక్షలకు 44,842 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా 40,066(89.35%) మంది హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు తొలిరోజు ఈ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడం విశేషమని, దేశంలో మరెక్కడా ఇంతపెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరు కాలేదని పాఠశాల విద్యా కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. తొలిరోజు పరీక్షలు సాఫీగా ముగిశాయన్నారు.

ఉదయం సెషన్‌లో ఎస్‌ఏ(గణితం) పరీక్షకు మొత్తం 98 సెంటర్లలో 23,531 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 20,735(88.12%) మంది హాజరయ్యారని, మధ్యాహ్నం స్కూల్‌ అసిస్టెంట్‌(బయోలాజికల్‌ సైన్స్‌) పరీక్షకు 88 కేంద్రాల్లో 21,311 మంది హాజరుకావాల్సి ఉండగా 19,331 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గం. నుంచి వెబ్‌సైట్‌లో ప్రాథమిక ‘కీ’ అందుబాటులో ఉంటుందని, అభ్యర్థులు వారి రెస్పాన్స్‌ షీట్లను కూడా సాయంత్రం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఇక, నుంచి ప్రతిరోజు జరిగే పరీక్ష ప్రాథమిక కీని సాయంత్రమే వెబ్‌సైట్లో ఉంచుతామన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచే అభ్యర్థులు రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

కేంద్రాన్ని సందర్శించిన మంత్రి గంటా
డీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం తిరుపతి జూపార్క్‌ సమీపంలోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌లో ఏర్పాటు చేసిన డీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు అభ్యర్థులను కూడా అడిగి తెలుసుకున్నారు. తొలిరోజు లాగే మిగతా పరీక్షలన్నీ సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు
*🔯 Mathematics and Biological Science Initial Official key Released by CSE*

 MATHEMATICS INTIAL KEY* 24/12/18 AM
BIOLOGICAL SCIENCE INTIAL KEY 24/12/18 P. M
Click here to Download Question Papers Session Wise


0 comments:

Post a Comment

Recent Posts