Monday, 30 September 2019

AP JLM Result 2019: ఏపీలో జేఎల్ఎం ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేసుకోండి ఇలా

AP JLM Result 2019: ఏపీలో జేఎల్ఎం ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేసుకోండి ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలు విడుదలయ్యాయి. ఉద్యోగులు ఎంపికయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APSPDCL నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ (ఎనర్జీ అసిస్టెంట్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 5107 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారికి అక్టోబర్ 1న అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనుంది ఏపీఎస్‌పీడీసీఎల్. జూనియర్ లైన్‌మెన్ (ఎనర్జీ అసిస్టెంట్) పరీక్షల్లో అర్హత సాధించినవారి జాబితాను APSPDCL అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి చూడొచ్చు. అందులో జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితాను అప్‌లోడ్ చేసింది APSPDCL. ఎంపికైన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ ఆర్డర్ల కోసం సంబంధిత సర్కిల్‌ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు అక్టోబర్ 1 లోగా కాల్ చేయాల్సి ఉంటుంది.

ఫోన్‌ నెంబర్ల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఏపీఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్ (ఎనర్జీ అసిస్టెంట్) పరీక్షా ఫలితాల కోసం మరోవైపు 2859 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ-APEPDCL నిర్వహించిన పరీక్షా ఫలితాలు కూడా వచ్చాయి. ఫలితాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా 
మీరు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన పరీక్ష రాసినట్టైతే APSPDCL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ-APEPDCL నిర్వహించిన పరీక్ష రాసినట్టైతే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే కుడి వైపు జేఎల్ఎం రిక్రూట్‌మెంట్ ట్యాబ్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న ఫోన్ నెంబర్లకు అక్టోబర్ 1 లోగా కాల్ చేయాలి.

0 comments:

Post a Comment

Recent Posts