ఉద్యోగాన్వేషణ మరింత సులువు ... Google కొత్త అప్లికేషన్
నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణ లో సాయపడ్డానికి అనేక జాబ్ పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ భాగం వాటిలో అధిక నైపుణ్యాలు అవసరం అయిన పెద్ద పెద్ద ఉద్యోగాలు మినహాయించి, చిన్న స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అంతగా లభించదు.ఈ తరుణంలో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం Google సంస్థ చిన్నచిన్న ఉద్యోగాల కోసం అన్వేషించే వారిని దృష్టిలో పెట్టుకొని Kormo అనే సంస్థ సహకారంతో ఒక ఆప్ ను ప్రవేశపెట్టబోతోంది.
శుక్రవార0 ఇది అధికారికంగా విడుదలచేయబడుతుంది. దేశవ్యాప్తంగా అనేక చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ఆఫీసుల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సమాచారం చాలా సందర్భాల్లో ఆన్లైన్లో లభించదు. చిన్న చిన్న వ్యాపార సంస్థలు తమ దగ్గర ఉన్న ఉద్యోగాలకు తగిన కాండిడేట్లను వెతికి పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి.ఈ తరుణంలో Google సంస్థ తీసుకు రాబోతునన్న ఈ Kormo అనే అప్లికేషన్ పూర్తిస్థాయిలో నిరుద్యోగులకు మరియు సంస్థలకీ అనుసంధానంగా ఉండబోతోంది.
ప్రధానంగా ఇది రిటైల్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ రంగాలలో ఉన్న ఉద్యోగాల మీద దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు షాపింగ్ మాల్స్, రిటైల్ ఔట్‌లెట్లలో ఖాళీగా ఉండే ఉద్యోగాలు, హోటల్స్ వంటి హాస్పిటాలిటీ రంగంలోని ఉద్యోగాలు, డెలివరీ బాయ్స్ వంటి లాజిస్టిక్స్ రంగంలో ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి సమాచారం ఈ Kormo అప్లికేషన్ ద్వారా ఇకమీదట తెలుసుకోవచ్చు.ఇప్పటికే ఈ అప్లికేషన్ బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఉద్యోగార్థులకు, సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తోంది. ఇండియాలో దీని సేవలు విస్తరించడం ద్వారా తక్కువ స్థాయి నైపుణ్యతలు కలిగి ఉన్న అనేకమంది సులభంగా ఉద్యోగాలు పొందటానికి ఇది ఉపకరిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహమే లేదు.
to Download app Available Soon

0 comments:
Post a Comment