Tuesday, 22 October 2019

ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన రివైజెడ్ షెడ్యూల్

APPSC నోటిఫికేషన్లలో మార్పులు
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ రివైజ్ అయింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజేనేయులు తెలిపిన వివరాల ప్రకారం రివైజ్ చేసిన షెడ్యూల్ లో మార్పులు ప్రకటించారు.
1) అందులో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్ పరీక్షలు (ఫిబ్రవరి 3, 2020), (ఫిబ్రవరి 4, 2020)న నిర్వహించనున్నారు.
2) అదే విధంగా డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ పోస్టు కోసం మెయిన్ పరీక్ష తేదీ (ఫిబ్రవరి 5, 2020), (ఫిబ్రవరి 6, 2020)గా ఖరారు చేశారు.
3) పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు కోసం (ఫిబ్రవరి 17, 2020) నుండి (ఫిబ్రవరి 20, 2020) తేదీల్లో నిర్వహించనున్నారు.
4) సంక్షేమ విభాగాల అసిస్టెంట్ పరీక్షల తేదీలను (ఫిబ్రవరి 26, 2020)తో పాటుగా (ఫిబ్రవరి 27, 2020)వ తేదీన జరుపనున్నారు.
5) రాయల్టీ ఇన్ స్పెక్టర్ పోస్టు కోసం (ఫిబ్రవరి 27, 2020)వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

6) సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల పరీక్ష (ఫిబ్రవరి 28, 2020)న నిర్వహించాలని నిర్ణయించారు.
7) ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం (ఫిబ్రవరి 28, 2020)న పరీక్ష నిర్వహించనున్నారు.
8) (ఫిబ్రవరి 28, 2020) అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్ష, అసిస్టెంట్ కెమిస్ట్ పరీక్ష జరుగనుంది.
9) (ఫిబ్రవరి 28, 2020), (ఫిబ్రవరి 29, 2020) టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం మెయిన్స్ నిర్వహించనున్నారు.
10) డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను (ఫిబ్రవరి12, 2020)తో పాటుగా (ఫిబ్రవరి 13, 2020)న నిర్వహించాలని నిర్ణయించారు.
11) జియో ఫిజికల్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం (మార్చి 27, 2020), మార్చి (29, 2020)న నిర్వహించనున్నారు.
12) (మార్చి 28, 2020) హౌడ్రోజియోలజీ టెక్నికల్ అసిస్టెంట్ కోసం పరీక్ష జరుగనుంది. 
13) (మార్చి 28, 2020)న వెల్ఫేర్ ఆర్గనైజర్ పరీక్ష నిర్వహించనున్నారు.
14) జిల్లా సైనిక సంక్షేమ అధికారుల పోస్టుల పరీక్షను (మార్చి 28, 2020) వ తేదీతోపాటుగా (మార్చి 29, 2020)న నిర్వహించనున్నారు.

15) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలను (మార్చి 28, 2020) వ తేదీతో పాటుగా (మార్చి 29, 2020) వ తేదీన నిర్వహించనున్నారు.
16) (మార్చి 29, 2020) డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

0 comments:

Post a Comment

Recent Posts