ఏపి ప్రభుత్వం ఉద్యోగ నియమకాలను వేగవంతం చేసింది. ఈ దశలో యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతులకు వీలుకల్పించే 'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏపీసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
షెడ్యూలు ప్రకారం అక్టోబరు 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి నగరాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఏపీసెట్-2019 పరీక్ష నిర్వహించనున్నారు.
ఇకపోతే మొత్తం 30 సబ్జెక్టులకు గాను పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపింది. రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉన్న ఈ పరీక్షలో మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
పేపర్-1లో 50 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-200 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
పేపర్-1లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
అభ్యర్థులు OMR పత్రంలో తమ సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
పేపర్-1కు గంట, పేపర్-2కు 2 గంటల పరీక్ష సమయం కేటాయించారు.
ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఇకపోతే పరీక్ష సమయం ఎలావుందంటే.. అక్టోబరు 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, ఉదయం11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment