Tuesday, 22 October 2019

28,29 తేదీల్లో ఎస్జీటీ తెలుగు అభ్యర్థులకు కౌన్సెలింగ్

28,29 తేదీల్లో ఎస్జీటీ తెలుగు అభ్యర్థులకు కౌన్సెలింగ్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) తెలుగు మాధ్యమం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 23వ తేదీ నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 28,29 తేదీల్లో ఎస్జీటీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ టి విజరుకుమార్‌ సోమవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎస్జీటీ ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ మాధ్యమాలకు చెందిన పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఎస్జీటీ ఇంగ్లీష్‌ మాధ్యమం పోస్టుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఇంకా విడుదల చేయలేదు. ఎస్జీటీ తెలుగు మాధ్యమంలో 3,786 పోస్టులకు 3,325 మంది అభ్యర్థులు ఎంపికైన విషయం విదితమే.


ఈనెల 28,29 తేదీల్లో ఎస్జీటీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు 3,325 పోస్టులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈనెల 23న ఎస్జీటీ తెలుగు మాధ్యమం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లు, నోటీసు బోర్డుల్లో పొందుపరుస్తారని తెలిపారు. ఖాళీలను గుర్తిస్తారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి కమిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో స్థలాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తుందని తెలిపారు.


ఈనెల 24న జిల్లాస్థాయి కమిటీ ఖాళీలను ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. ఈనెల 25,26 తేదీల్లో డీఈవోలు అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈనెల 28,29 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు నియామకపత్రాలు, పోస్టింగ్‌ అర్డర్‌లు అందజేస్తారని వివరించారు. ఈనెల 30న నియామకపత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.


వచ్చేనెల 2న పాఠశాలల్లో చేరని అభ్యర్థుల వివరాలను డీఈవోలు గుర్తించాలని తెలిపారు. వచ్చేనెల 4న కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా నియామక పత్రాలు, పోస్టింగ్‌ఆర్డర్‌లను పంపిస్తారని పేర్కొన్నారు. వచ్చేనెల 5న పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయుల వివరాలను ఎంఈవోలు/హెచ్‌ఎంలు డీఈవోలకు అందజేయాలని సూచించారు. వచ్చేనెల 7న పాఠశాలల్లో చేరని అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని తెలిపారు. జిల్లాల వారీగా చేరిన ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి డీఈవోలు పంపించాలని సూచించారు.

0 comments:

Post a Comment

Recent Posts