Tuesday, 22 October 2019

తెలుగు రాష్ట్రాల్లో 3677 పోస్టల్ ఉద్యోగాల భర్తీకి గానూ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ

3677 పోస్టల్ ఉద్యోగాలు.. పదోతరగతి అర్హత!
పోస్టల్ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో 3677 ఉద్యోగాల భర్తీకి గానూ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేడు(మంగళవారం అక్టోబరు 22) ప్రారంభమైంది.
అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి నవంబరు 14 వరకు అవకాశం ఉంది. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు.

పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి

0 comments:

Post a Comment

Recent Posts