Monday, 21 October 2019

జియోలో కొత్త 'ఆల్ ఇన్ వన్' ఫ్యాకేజీలు

టెలికాం సంచనలం జియో ఇన్నాళ్లు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అన్ లిమిటెడ్ టాక్ టైమ్ ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్స్ చేస్తే ఛార్జ్‌లు వసూలు చేస్తోంది.

ఐయూసీ కింద ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఐతే, ఆ మొత్తానికి డేటా రూపంలో అందిస్తామని జియో తెలిపింది. వినియోగదారుడికి రిఛార్జ్ తలనొప్పులని దూరం చేసేందుకు జియో ఆల్ ఇన్ వన్ పేరిట డేటా, ఐయూసీ నిమిషాలు కలిగిన సరికొత్త పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.


ఐయూసీ నిమిషాలు మించితే, మళ్లీ నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాలి.
ఇందుకు రూ.10 నుంచీ టాపప్‌ చేసుకోవచ్చు. ఈ సరికొత్త పథకాలు ఇలా ఉండబోతున్నాయ్.

* రూ. 222తో రిఛార్జ్ చేసుకొంటే 56జీబీ డేటా 1000నిమిషాల ఐసీయూ కాల్స్ లభించనున్నాయి. ఇది 28రోజుల ప్లాన్ మాత్రమే.

* ఇక రూ. 333తో రిఛార్జ్ చేసుకొంటే 112జీబీ డేటా 1000నిమిషాల ఐసీయూ కాల్స్ లభించనున్నాయి. ఇది 56రోజుల ప్లాన్ లో భాగంగా అదించనుంది.

* రూ. 444తో రిఛార్జ్ చేసుకొంటే 168జీబీ డేటా 1000నిమిషాల ఐసీయూ కాల్స్ లభించనున్నాయి. ఇది 84రోజుల ప్లాన్ లో భాగంగా అదించనుంది.

* రూ. 555తో రిఛార్జ్ చేసుకొంటే 168జీబీ డేటా 3000నిమిషాల ఐసీయూ కాల్స్ లభించనున్నాయి. ఇది 84రోజుల ప్లాన్ లో భాగంగా అదించనుంది.

0 comments:

Post a Comment

Recent Posts