Tuesday 22 October 2019

టీఆర్‌టీ ఎస్టీటీ పోస్టుల నియామక షెడ్యూల్ విడుదల

తెలంగాణలో టీఆర్‌టీ ఎస్టీటీ తెలుగు మీడియం పోస్టుల నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. 
తెలుగు మీడియం ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన మొత్తం 3,325 మంది అభ్యర్థులకు అక్టోబరు 23 నుంచి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నియామక కౌన్సెలింగ్ జరగనుంది అని టీఎస్‌పీఎస్సీ ప్రకటన చేసింది. 

అక్టోబరు 30 వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగనుంది. టీఆర్‌టీ తెలుగు మీడియం ఫలితాలను అక్టోబరు 11 వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,786 పోస్టులకు గానూ 3,325 మంది అభ్యర్థులతో కూడిన ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
 అయితే వివిధ కారణాల వల్ల 461 పోస్టుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ పెండింగ్‌లో ఉంచింది.
వీటిలో కోర్టు వివాదం కారణంగా 117 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ప్రకటించలేదు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ నుంచి సమాచారం వచ్చాక దివ్యాంగుల కోటాలో 270 పోస్టుల ఫలితాలను ప్రకటించనున్నారు. 

అర్హులైన అభ్యర్థులు లభించని కారణంగా 74 పోస్టులను భర్తీ చేయలేదు. ఫలితాలు వెల్లడించిన 7 నెలల తర్వాత అభ్యర్థుల ఎంపిక జాబితాను కమిషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4న టీఆర్టీ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఆర్టీకి సంబంధించి స్కూల్‌అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ కూడా ఇచ్చారు.

0 comments:

Post a Comment

Recent Posts