భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో .. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బెల్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ; ఎంపికైన వారికి నెలకు రూ. 23వేల జీతం ఇస్తారు.
విద్యార్హత : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్, మెకానికల్ విభాగాల్లో B.E లేదా B-TECH పాస్ కావాల్సి ఉంటుంది. జనరల్, OBC అభ్యర్థులు ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాల్సి ఉంటుంది.
SC, ST వికలాంగ అభ్యర్థులకు మాత్రం పాస్ మార్కులు వస్తే సరిపోతోంది.
వయస్సు : అభ్యర్ధులు నవంబర్ 1, 2019 నాటికి 25 ఏళ్లు మించకూడదు. SC, STలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 23, 2019
దరఖాస్తు చివరితేది: నవంబర్ 2, 2019
0 comments:
Post a Comment