Monday, 21 October 2019

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ ఫీజు గడువు పెంపు.. చివరితేదీ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో  టెన్త్ ఫీజు గడువు పెంపు.. చివరితేదీ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్​ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును వచ్చే నెల ఏడో తేదీకి పెంచుతున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్​ సుధాకర్​ ప్రకటించారు. 

ఈ మేరకు సోమవారం కొత్త షెడ్యూల్​ ప్రకటించారు. ఎలాంటి ఫైన్​ లేకుండా వచ్చేనెల 7 వరకు, రూ.50 ఫైన్‌తో నవంబర్​ 23 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్‌ 9 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్‌ 23 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
 ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. దాంతో టెన్త్​ స్టూడెంట్లు ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. 

హెడ్మాస్టర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts