కేజీబీవీ టీచర్ల బదిలీలకు షెడ్యూల్
అక్టోబర్ 23వ తేదీ నుంచి బదిలీల (కేజీబీవీల మార్పు) ప్రక్రియను చేపట్టేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) షెడ్యూల్ జారీ చేసింది.కేజీబీవీల్లో పనిచేస్తున్న పీజీ సీఆర్‌టీ, సీఆర్‌టీ, ఏఎన్‌ఎం, పీఈటీలు ప్రస్తుతం పనిచేస్తున్న కేజీబీవీల నుంచి జిల్లాలోని ఇతర కేజీబీవీలకు, ఇతర జిల్లాల్లోని కేజీబీవీలకు మారాలనుకునేవారు, స్పౌస్ కేటగిరీలో మారాలనుకునే వారు అక్టోబర్23 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (samagrashiksha.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్, ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
ఈ బదిలీలకు సంబంధించిన సమగ్ర వివరాలు, సూచనలు, మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో దాదాపు 7 వేల మంది ఉద్యోగులు ప నిచేస్తున్నారు. అందులో అనేక మంది భార్య/భర్తలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎప్పటినుంచో బదిలీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే వారంతా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారు కాబట్టి రెగ్యులర్ టీచర్ల తరహాలో బదిలీలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో పాత కేజీబీవీల్లో వారిని తొలగించి వెబ్ ఆప్షన్ల ప్రకారం వారు కోరుకున్న కొత్త కేజీబీవీల్లో మళ్లీ కాంట్రాక్టు పద్ధతిన తీసుకునేలా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
0 comments:
Post a Comment