Saturday 26 October 2019

పీఎం కిసాన్ మూడో విడత నగదు వచ్చిందా?...ఎలా తెలుసుకోవడమో తెలుసా?

పీఎం కిసాన్ మూడో విడత నగదు వచ్చిందా?...ఎలా తెలుసుకోవడమో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనే పథకాన్ని రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 అందజేస్తుంది. 


ఈ రూ.6 వేలు మూడు దఫాలుగా రైతుల అకౌంట్లలో జమవుతుంది.మోదీ సర్కార్ ఇప్పటికే మూడో విడత డబ్బులను కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. అయితే 50,000 మంది అర్హులు ఉంటే కేవలం 20,000 మందికి మాత్రమే మూడో విడత డబ్బులు అందాయి. ఈ నేపథ్యంలోనే మీరు కూడా మీ మూడో విడత డబ్బులు వచ్చాయో.. లేదో.. సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. 


✺ pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 
✺ పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది.
✺ దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిలూర్ రికార్డ్, బెనిఫీషియరీ స్టేటస్, బెనిఫీషియరీ లిస్ట్ అనే నాలుగు ఆప్షన్లు కనినిస్తాయి. 


✺ వీటిల్లో బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. 
✺ ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో మూడో విడత డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts