Thursday, 31 October 2019

ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి అయిన "సర్దార్ వల్లభాయ్ పటేల్" గారి జయంతి నేడు.. ఆ మహోన్నత మైన వ్యక్తి గురించి కొన్ని విషయాలు

ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి అయిన "సర్దార్ వల్లభాయ్ పటేల్" గారి జయంతి నేడు.. ఆ మహోన్నత మైన వ్యక్తి గురించి కొన్ని విషయాలు
👉గుజరాత్‌ రాష్ట్రంలోని ‘నడియాడ్‌లో 1875 అక్టోబర్‌ 31వ తేదీన జవేరాబాయి పటేల్‌, లాడ్‌బాయి దంపతులకు, నాలుగవ సంతానంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మించాడు. పటేల్‌ తన 6వ ఏటనే కరమ్‌సాద్‌లోని ఒక గుజరాతీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభమయింది. కానీ ఆయనకు ఆంగ్ల విద్యనభ్యసించాలనే ఉబలాటం ఉంది. ఆ పరిస్థితిలో అదష్టం అతని ఇంటి తలుపు తట్టినట్టయింది. తన ఊరిలోనే ఒక ప్రైవేటు ఆంగ్ల పాఠశాల స్థాపించబడింది. మూడు సంవత్సరాలు ఆ పాఠశాలలో విద్యార్జన చేసాడు. పిదప పెట్లాడ్‌ గ్రామంలో పటేల్‌ తన ఊరివారైన ఆరుగురు విద్యార్థులతో ఒక వసతి గృహాన్ని ఏర్పరుచుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించడం, అందుకోసం ఎంతటివారితోనైనా తలపడటం పటేల్‌కు చిన్ననాటి నుండి ఉన్న గుణం.


👉కేవలం తిరుగుబాటుతత్వమే గాక అవసరమైనప్పుడు తోడ్పడే సుగుణం కూడా పటేల్‌లో ఉంది. పటేల్‌కు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెట్రిక్‌ పూర్తయింది. న్యాయవాదిగా జీవితం సాగించాలనే కాంక్ష ఉందిగానీ యల్‌.యల్‌.బి. పూర్తి చేయాలంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. అంతటి తీరికగాని ఆర్థిక స్థోమతగానీ తనకు లేదు. పుస్తకాలను స్థానిక న్యాయవాదుల వద్ద అడిగి తెచ్చుకొని 3 సంవత్సరాలు నిర్విరామ కృషి సల్పి ప్లీడర్‌ పరీక్ష పాసయ్యాడు. వకీలుగా ఆయన గోద్రాలో రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేసారు. కొద్ది రోజులలోనే ఆయన క్రిమినల్‌ లాయర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.

👉పోలీస్‌లు తెచ్చే కేసులలో ఆయన ముద్దాయిల తరఫున వాదించేవారు. వారు తెచ్చే దొంగ సాక్షులను తన ప్రశ్నల పంరపరతో తికమక పెట్టి ముద్దాయిలను విడుదల చేయించేవారు. స్వాతంత్య్రం వచ్చేసరికి దేశం రెండు ప్రాదేశికాలుగా చీలిపోయింది. అందులో ఒకటి బ్రిటిష్‌ సామ్రాజ్యం ఆధీనంలో ఉండగా సంస్థానాధీశుల ఏలుబడిలో ఉంది. సంస్థానాధీశులలో చాలా మంది దేశభక్తులు జాతీయవాదులు ఉన్నప్పటికీ, వారిలో ఎదురు తిరిగినవారు కూడా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పుదుచ్చేరి, యానాం, కరైకాల్‌, డయ్యూ, డామన్‌ వంటి ప్రాంతాలు పరాయి ప్రాంతాలు పరాయి దేశాల పాలనలో ఉండేవి. ముఖ్యంగా శతాబ్దాల నుండి అనువంశిక పాలనలో ఉన్న సంస్థానాలను భారత్‌ యూనియన్‌లో విలీనయమ్యేటట్లు చేయడంలో పటేల్‌ సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు అమోఘం.
నయానా, భయాన వారిని ఒప్పించడంలో ఆయన సఫలం అయ్యారు. ఇందుకు వ్యవధి కూడా పట్టింది. అందుకే స్వాతంత్య్రం వచ్చిన(1947) తొమ్మిదేళ్లకుగానీ రాష్ట్రాల పునర్వవస్థీకరణ జరగలేదు. బ్రిటిష్‌ పాలనలో మద్రాస్‌ కలకత్తా బొంబాయి ప్రావిన్స్‌లు ఉండేవి. మన రాష్ట్రానికి చెందిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు, ప్రావిన్సులను తెలంగాణా ప్రాంతం నైజాం పాల నలో ఉండేవి. అమర జీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానంతో మద్రాసు ప్రావిన్సు నుంచి ‘కర్నూలు రాజ ధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంకోసం స్వాతంత్య్ర సమరంలో భాగంగా ఉద్యమం సాగింది. తెలుగు వారందరిని కలిపి వుండేందుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ఆనాడు అన్ని ప్రాంతాల వారిలోనూ ఉంది.
👉తెలుగువారు అంతా ఎవరి పరిధిలో వారు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు, కష్టనష్టాలకు ఓర్చి నిరవధికంగా ఉద్యమాలు సాగించడం వలననే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. వారి కృషికి కేంద్రంలో సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ తీసుకున్న చర్యలను ఎంతో దోహదం చేసాయి. ముఖ్యంగా సంస్థానాధీశులను ఒప్పించడంలో పటేల్‌ చూపిన ముందుచూపు, సమయస్ఫూర్తి, పట్టువిడుపుల వైఖరి నభూతో నభవిష్యత్‌.మహాత్మునికి అనుసరునిగా స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి పటేల్‌ సారథ్యం వహించారు. జీవితాంతం గాంధీజీ ఆశయాలకు కట్టుబడి దఢదీక్షాధ్యక్షునిగా స్వరాజ్య సాధనా సమరానికి అంకితమయ్యారు. దేశ సేవా తత్పరునిగా సర్వస్వం త్యాగం చేసి బ్రిటిష్‌ నిరంకుశ ప్రభుత్వం పారదోలడానికి అనుక్షణం శ్రమించారు.

👉బాగ్దోలి ఉద్యమనేత 1931న కరాచి కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కినిస్టిట్యూంట్‌ అసెంబ్లీ వివిధ కమిటీల చైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. స్వాతంత్య్ర అనంతరం నవభారత ఐక్యతా, సమగ్ర జాతి నిర్మాతగా ఉక్కుమనిషిగా జాతీయ అగ్రశ్రేణి నేతగా ఆరాధ్యనీయుడయ్యా రు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్య్ర సర్వాధిపత్య రాజ్యంగా పాలించాలనే రాజ్యకాంక్ష దాహంతో విర్రవీగి ఎదురు తిరిగిన నైజాం నవాబు 1948 సెప్టెంబరు 13, 18 తేదీల పోలీస్‌ చర్యకు లొంగి తలవంచి, ఇండియన్‌ యూనియన్‌కు దాసోహం ప్రకటించడం పటేల్‌ రాజనీతిజ్ఞతకు, ఉక్కుమనిషి సర్దార్‌ దీక్షాదక్షతలకు నిదర్శనం.సర్దార్‌ వల్లభా§్‌ు పటేల్‌ భారతదేశంలో పుట్టివుండకపోతే భారతదేశ ప్రపంచ పటంలో ఇంకొకలా ఉండేది.

👉వయోభారం వలన, అనారోగ్యం వలన కార్యభారం వలన పటేల్‌ కుంగిపోయారు. బొంబాయి వాతావరణం ఆయనకు ఉపశాంతినిస్తుందన్న వైద్యుల సలహా మేరకు ఆయనను బొంబాయి చేర్చారు. అప్పుడు పటేల్‌ తన కుమార్తెతో తను చనిపోతే ”నా దగ్గర రెండు సంచులు ఉన్నాయి. ఆ రెండింటిని నెహ్రూకి అప్పగించమని చెప్పాడు. డాక్టర్లు ఉపయోగించిన మహా, మహామందులు సైతం ఆ సమయాన ఓడిపోయాయి. నవభారత నిర్మాత, సుస్థిర రక్షకుడు, భారతజాతి ప్రియతమ నాయకుడు ఉక్కుమనిషి కార్యశూరుడైన పటేల్‌ తన 75వ ఏట 1950 డిసెంబరు 15వ తేదీన స్వర్గస్తులయ్యారు.

👉ఆయన చివరి కోరిక ప్రకారం బొంబాయిలోని ”క్వీన్స్‌ మేరి శ్మశాన వాటికలో ఆయన పవిత్ర దేహాన్ని దహనం కావించారు. అగ్నిదేవుడా! శరీరాన్నాహుతి గొనేవేళ లక్షోప లక్షల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రధాని నెహ్రూ తన కుడి భుజం పడిపోయినట్లుగా ఎంతగానో వాపోయారు. నేటికీ దేశం ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పు డు ‘ఈ సమయంలో పటేల్‌ ఉంటే ఎంత బావుండేదో అనేమాట ప్రజల నాలుకలపై ఆడుతుంటుంది. కాశ్మీర్‌ సమస్య తలెత్తినప్పుడల్లా భారత్‌ ప్రజలు వల్లభాయ్ పటేల్‌ను జ్ఞాపకం చేసుకోని భారతీయులుండరు.

0 comments:

Post a Comment

Recent Posts