Monday, 21 October 2019

తెలంగాణలో JL, JA పోస్టుల అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

తెలంగాణలో JL, JA పోస్టుల అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
విద్యుత్‌శాఖలో 3,025 జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి.


నిరుద్యోగులకు పోస్టులకు అప్లయ్ చేసుకునే పనిలో పడ్డారు. కాగా, ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం http://studycircle.cgg.gov.in/tsbcw/Index.do వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలన్నారు. కోచింగ్, ఇతర వివరాలకు 04024071178 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ శాఖలో 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. మూడు క్యాటగిరీల్లోని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 2,500.. జూనియర్‌ అసిస్టెంట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు 500.. జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులు 25.. మొత్తం 3 వేల 25 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు.


ఆయా పోస్టులు అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం, రిజర్వేషన్లు, ఇతర సమాచారం నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థకు చెందిన TS SOUTH POWER CGG.GOV.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్‌ అసిస్టెంట్‌ కం కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు అక్టోబర్ 30 నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 20 గడువుగా ఉంది. హాల్‌ టికెట్లను డిసెంబర్‌ 11 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను డిసెంబర్ 22న నిర్వహిస్తారు.



జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు అక్టోబర్‌ 21 నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించేందుకు నవంబర్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. హాల్‌ టికెట్లను డిసెంబర్‌ 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష డిసెంబర్‌ 15న నిర్వహిస్తారు. జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 10 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. హాల్‌ టికెట్లను డిసెంబర్‌ 5 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష డిసెంబర్‌ 15న నిర్వహిస్తారు.

0 comments:

Post a Comment

Recent Posts