Monday 21 October 2019

మీ SBI అకౌంట్‌ను మరో బ్రాంచీకి మార్చుకోవడం ఎంతో సులభం?


ఆన్‍లైన్ ద్వారా ఎన్నో పనులు చకచకా సాగుతున్నాయి. బస్సు, రైలు, విమాన టిక్కెట్ కావాలన్నా, ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఆన్‌లైన్ సులభ మార్గంగా మారింది. అలాగే, ఆన్ లైన్ ద్వారా ఆయా బ్యాంకులు కూడా ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నాయి. అకౌంట్ ఓపెనింగ్ నుంచి హోమ్ లోన్ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. బ్యాంకుకు వెళ్లి, వరుసలో నిలబడే బాధలు తప్పాయి. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఈ బ్యాంకు అకౌంట్‌ను ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి ఆన్ లైన్ ద్వారా మార్చుకునే వెసులుబాటు ఉంది.
మీరు ఇప్పుడు ఉన్న ఇంటిని మార్చి కొత్త ఇంటికి వెళ్లారా? మీకు బ్యాంకు దూరం అయిందా? మీ ఎస్బీఐ ఖాతాను మీ సమీపంలోని మరో బ్రాంచీకి ట్రాన్సుఫర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది ఆన్ లైన్ ద్వారా చాలా సులభం. ఇది వరకు అయితే మీరు ట్రాన్సుఫర్ అప్లికేషన్ నింపి, బదలీ కారణం పేర్కొంటూ, దరఖాస్తు ఇవ్వాలి. బ్యాంకు అధికారి ధృవీకరించుకునేందుకు మీరు ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. దీనికి సమయం కూడా తీసుకుంటుంది. తమ కస్టమర్లకు ఇబ్బందులు నివారించేందుకు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. 

 ఖాతాను మీ సమీపంలోని మరో బ్రాంచీకి ట్రాన్సుఫర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది ఆన్ లైన్ ద్వారా చాలా సులభం. ఇది వరకు అయితే మీరు ట్రాన్సుఫర్ అప్లికేషన్ నింపి, బదలీ కారణం పేర్కొంటూ, దరఖాస్తు ఇవ్వాలి. బ్యాంకు అధికారి ధృవీకరించుకునేందుకు మీరు ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. దీనికి సమయం కూడా తీసుకుంటుంది. తమ కస్టమర్లకు ఇబ్బందులు నివారించేందుకు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్‌ను ఆన్ లైన్ ద్వారా ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
2
ఇలా చేయండి..

ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా సులభంగా అకౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. దీనికి కింది స్టెప్స్ ఫాలో కావాలి.

- ఎస్బీఐ అధికారిక www.onlinesbi.com వెబ్ సైట్‌లోకి లాగిన్ అవాలి.
- మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో personal banking ను సెలక్ట్ చేసుకోవాలి.
- పైన ఉన్న మెను బార్‌లోని ట్యాబ్‌లో e-services పైన క్లిక్ చేయండి.
- ఆ తర్వాత Transfer of savings account పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటున్న అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకోండి.
- మీకు ఒకే అకౌంట్ ఉంటే డిఫాల్ట్‌గా సెలక్ట్ అవుతుంది.
- ఆ తర్వాత మీరు ఏ బ్రాంచీకి ట్రాన్సుఫర్ చేయాలనుకుంటున్నారో పేర్కొనాలి. ఆ బ్రాంచీ కోడ్ ఎంటర్ చేయాలి.
- టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని Submit పైన క్లిక్ చేయాలి.

3
సక్సెస్ ఫుల్ సందేశం..

- పాత, కొత్త బ్రాంచీలోని మీ అకౌంట్ బదలీ వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత Confirm పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.
- దానిని ఎంటర్ చేసి confirm పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు Your branch transfer request has been successfully registered అంటూ విజయవంతమైందని సందేశం వస్తుంది. '
- ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండి, రిజిస్టర్డ్ మొబైల్ ఉంటే ఆన్‌లైన్ ట్రాన్సుఫర్ చేసుకోగలరు.


0 comments:

Post a Comment

Recent Posts