Monday, 11 November 2019

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు
నిరుద్యోగులకు ఈ మధ్యకాలంలో శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రంలో ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతున్నాయి. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలోను పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే.. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితో పాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే ట్రేడ్ వారీగా ఈ పోస్టులు ఇవ్వనున్నారు. 249 ఏసీ మెకానిక్‌ పోస్టులు, 16 కార్పెంటర్ పోస్టులు, 640 డీజిల్ మెకానిక్‌ పోస్టులు, 18 ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు, 871 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 102 ఎలక్ట్రానిక్ మెకానిక్‌ పోస్టులు, 1460 ఫిట్టర్‌ పోస్టులు, 74మెషినిస్ట్ పోస్టులు, 24 ఎఎండబ్ల్యూ పోస్టులు, 12 ఎంఎంటీఎం పోస్టులు, 40 పెయింటర్‌ పోస్టులు, 597 వెల్డర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.


అయితే ఈ పోస్టులకు అర్హత 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా ఈ పోస్టులకు 08.12.2019 నాటికి అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. కాగా ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. కాగా దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 09.11.2019 తేదీన ప్రారంభమయి 08.12.2019 తేదీన ముగుస్తుంది.

0 comments:

Post a Comment

Recent Posts