Andhra Pradesh out sourcing corporation - certain guidelines isdued
Click here to Download Guidelines
ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ (ఏపీసీవోఎస్) మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ విధానంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ సంస్థలోకి బదిలీ అవుతారని వాటిలో పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా శాఖలు, కాంట్రాక్టు సంస్థలను కార్పొరేషన్‌లోకి విలీనం చేసుకుంటుంది. వాటికి యూనిక్ కోడ్ ఇస్తుంది.
రాష్ట్రప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థలకు ఔట్‌సోర్స్ ద్వారా మానవ వనరులను సమకూర్చేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, మధ్యవర్తులను తొలగించడం, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో అవినీతి నివారణ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు మహళలకు నియామకాల్లో 50 శాతం కోటా అమలు, సకాలంలో పూర్తి వేతనాలు చెల్లించడంతో పాటు ఈపీఎఫ్, ఈఎ్‌సఐ చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటుందని బుధవారం విడుదల చేసిన ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. డిసెంబరు 15లోపు ఈ ప్రక్రియను ఆయా సచివాలయ శాఖలు, జిల్లా స్థాయి కమిటీలు, విభాగాల ప్రధానాధికారులు పూర్తిచేయాలని ఆదేశించారు. వచ్చే జనవరికల్లా ప్లేస్‌మెంట్ సమాచారాన్ని ఔట్‌సోర్సింగ్ సంస్థ తెలియజేస్తుంది. కీలక మార్గదర్శకాలివీ..
కాంట్రాక్టు సంస్థ, శాఖలు యూనిట్‌గా బదిలీ చేసేటప్పుడు రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. జీతాల స్లిప్పు, బ్యాంకు ఖాతా నంబరు, ఈపీఎఫ్, ఈఎ్‌సఐ ఖాతాల వివరాలు సేకరిస్తారు.
ప్రతి జిల్లాలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌కు కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్-2 మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఆయా సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తారు.
జిల్లా స్థాయి కమిటీ జిల్లాలోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సంస్థలోకి బదిలీ చేస్తుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ, మైనారిటీలకు 29 శాతంతో మొత్తం 50 శాతం అమలు చేయాలి. జిల్లా యూనిట్‌గా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని తొలగించాల్సి వస్తే.. అందరి కంటే జూనియర్లను తొలగించాలని పేర్కొన్నారు. ఒక యూనిట్‌లో తొలగించిన సిబ్బందిని ఇతర యూనిట్లలో ఖాళీలుంటే అక్కడ సర్దుబాటు చేస్తారు.
కొత్త సిబ్బందిని నియమించుకోవాలనుకుంటే జిల్లా స్థాయి కమిటీ ఆ ప్రక్రియ చేపడుతుంది. అలా నియమించిన సిబ్బంది జాబితాను కలెక్టర్ ఔట్‌సోర్సింగ్ సంస్థకు పంపుతారు. ఈ జాబితాను చూసి ఇన్‌చార్జి మంత్రి గానీ, ఆయా శాఖల మంత్రులు గానీ రిజర్వేషన్ల అమలు తీరును పరిశీలిస్తారు.
డ్యూటీ సర్టిఫికెట్లను సమర్పిస్తే సిబ్బందికి వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
Click here to Download Guidelines
0 comments:
Post a Comment