Saturday, 9 November 2019

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి!

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి!

డబ్బు అవసరమైతే పీఎఫ్ డబ్బులను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) కొన్ని రూల్స్ కలిగి ఉంది. వీటి ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు కాంపౌండింగ్ ప్రయోజనం కలుగుతుంది. అలాగే పెన్షన్ ప్రయోజనాలు కూడా పొందొచ్చు. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు రిటైర్మెంట్ వరకు పీఎఫ్ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోకపోతే అప్పుడు వారికి పెన్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే పీఎఫ్ వడ్డీపై కాంపౌండిగ్ ప్రయోజనం లభిస్తుంది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలిగించే ఈపీఎఫ్‌వో నిబంధనలపై ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజర్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరీ మాట్లాడుతూ.. ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగుల సాధారణంగానే పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారని తెలిపారు.

ఇలా చేయడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు కేవలం డబ్బులు మాత్రమే వెనక్కు తీసుకోవడం లేదని, పీఎఫ్ వడ్డీ కాంపౌండింగ్ ప్రయోజనం కూడా కోల్పోతారని వివరించారు. పదవీ విరమణ వరకు పీఎఫ్ డబ్బులు తీసుకోకపోతే EPFO rules ప్రకారం అప్పుడు సబ్‌స్క్రైబర్లు పెన్షన్ ప్రయోజనాలు పొందొచ్చని ఝవేరీ తెలిపారు. పీఎఫ్ ఖాతాలో ఎక్కువ కాలం డబ్బులు కొనసాగిస్తే.. వడ్డీ మీద వడ్డీ పొందొచ్చని అప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని పేర్కొన్నారు.

పీఎఫ్ ఖాతాదారులు వారి PF డబ్బులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఝవేరీ తెలిపారు. మెచ్యూరిటీ డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదని గుర్తు చేశారు. అలాగే సెక్షన్ 80 సీ కింద పీఎఫ్ అకౌంట్‌లో రూ.1.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌కు కూడా పన్ను మినహాయింపు ఉందని తెలిపారు

. రిఅయిన తర్వాత వెంటనే పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత డబ్బులు తీసుకోకపోతే వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ డబ్బులను తీసుకొని ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధానాల్లో పెట్టుబడిగా పెడితే ప్రయోజనం పొందొచ్చని సోలంకి సూచించారు. ప్రభుత్వ బాండ్లు, బ్యాంక్ బాండ్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు.

0 comments:

Post a Comment

Recent Posts