Sunday, 10 November 2019

పన్నుచెల్లింపుదారులకు శుభవార్త, ట్యాక్స్ నోటీసులు తనిఖీ చేసుకోవచ్చు

పన్నుచెల్లింపుదారులకు శుభవార్త, ట్యాక్స్ నోటీసులు తనిఖీ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ నవంబర్ 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ట్యాక్స్ అఫీషియల్స్ వర్క్‌లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ఇది తీసుకువస్తుంది. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ ఎవరైనా జీఎస్టీ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ పన్ను చెల్లింపుదారుల పన్ను నోటీసును, సెర్చ్ మెమో, ఇతర సమాచార మార్పిడి యథార్థతను తనిఖీ చేయవచ్చు.. వెరిఫై చేసుకోవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.


1 అవి చెల్లుబాటు కావు...
జీఎస్టీ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వంటి పన్ను చెల్లించేవారు ట్యాక్స్ నోటీసులను తనిఖీ చేసుకోవచ్చు. దీంతో పన్ను నోటీసులు నిజమా.. కాదా అనే విషయం తెలుసుకోవచ్చు. మెమో సెర్చ్ ఫెసిలిటీ కూడా ఉంది. తొలుత ఈ సేవలు ఐటీ డిపార్టుమెంట్ పరిధిలోకి వస్తాయి. నవంబర్ 8వ తేదీ, ఆ తర్వాత విడుదలయ్యే నోటీసులపై కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ లేకపోతే చెల్లుబాటు కావని CBIC రెండురోజుల క్రితం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

2 నోటీసుల యదార్థతను ధృవీకరించుకోవచ్చు

CBIC డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్లు వారు అందుకునే నోటీసుల యథార్థతను ధృవీకరించుకోవచ్చునని తెలిపింది. సెర్చ్ అండ్ అరెస్ట్ నోటీసులు వంటి ఇన్వెస్టిగేషన్ సంబంధిత అంశాల కోసం తొలిగా CBIC-DINను ఉపయోగిస్తారు. ఈ ఏడాది చివరకు ఇతర అంశాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తారు.

3 అక్టోబర్ 1 నుంచి సీబీడీటీ అమలు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇప్పటికే DIN విధానాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది. CBICలో అమలుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. CBIC-DIN తీసుకు రావడానికి వివిధ కారణాలు కూడా ఉన్నాయి....

4 అందుకోసమే..


నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ట్యాక్స్ అధికారుల వేధింపుల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలులోకి తీసుకు వచ్చింది. జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్‌ను CBIC నిర్వర్తిస్తుండగా, ఆదాయపన్ను, కార్పోరేషన్ ట్యాక్స్ వంటి వాటిని CBDT నిర్వహిస్తోంది. ఈ రెండింటి నుంచి వెలువడే అన్ని డాక్యుమెంట్స్‌కు కచ్చితమైన ఆడిట్ ట్రయల్ ఉంటుంది. అంటే CBIC DINలో 20 డిజిట్స్ ఉంటాయి. ఇది డాక్యుమెంట్‌పై కనిపిస్తుంది. CBDTలో మాత్రం 10 డిజిట్స్ ఉంటాయి. ఈ నెంబర్‌ను అధీకృత అధికారులు మాత్రమే జనరేట్ చేస్తారు. నవంబర్ 8 నుంచి CBIC-DIN అమలులోకి వచ్చింది.

0 comments:

Post a Comment

Recent Posts