నా ఫోన్‌లో కొన్నిసార్లు డూప్లికేట్ కాంటాక్టులు కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తి నెంబర్ రెండుసార్లు కనిపించడం, ఒక వ్యక్తికి కాల్ చేయబోతే మరో వ్యక్తికి వెళ్లడం జరుగుతోంది. దీనికి పరిష్కారం చెప్పగలరు.
Mercy
మీరు వాడుతున్న ఫోన్ మోడల్ పేర్కొనలేదు. సహజంగా మన ఫోన్‌లో ఉండే కాంటాక్ట్స్ అప్లికేషన్ కరప్ట్ అయినప్పుడు
ఈ సమస్య తలెత్తుతుంది. దీనికి ఒకటే పరిష్కారం. మీ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ అనే జాబితాలో కాంటాక్ట్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి క్లియర్ డేటా కొట్టండి.
సహజంగా చాలా సందర్భాల్లో గూగుల్ కాంటాక్ట్స్‌తో మీ డేటా లింక్ అయి ఉంటుంది కాబట్టి మళ్లీ డేటా మొత్తం తిరిగి వెనక్కి వస్తుంది.
ఒకవేళ మీ కాంటాక్ట్స్ బ్యాకప్ లేకపోతే వాటిని బ్యాకప్ తీసుకోవటం మంచిది. కొన్నిసార్లు మీ గూగుల్ అకౌంట్ తొలగించి, మళ్లీ జత చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.
0 comments:
Post a Comment