Wednesday, 6 November 2019

మీ ఫోన్ రేడియేషన్ ఎంతో చెక్ చేశారా?ఫీచర్లు సరే.. హెల్త్ డేంజర్‌లో

మీ ఫోన్ రేడియేషన్ ఎంతో చెక్ చేశారా?ఫీచర్లు సరే.. హెల్త్ డేంజర్‌లో


మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. ఫీచర్లు ఎలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ ఏంటి? ఎంత ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ సరిపోతుందా? బడ్జెట్ ధర ఎంత ఉంది అని తెలుసుకుని మరి స్మార్ట్ ఫోన్ కొనేస్తారు.


కానీ, చాలామంది కొనుగోలు చేసిన ఫోన్ తర్వాత రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఫోన్ రేడియేషన్ స్థాయి ఎంత ఉంది అనేది మాత్రం అసలే పట్టించుకోరు. ఎంతసేపు.. ఫీచర్లు బాగున్నాయా? మన బడ్జెట్ ధరకే ఫోన్ వస్తుందా లేదా ఇదే లెక్కలేసుకుంటారు. ప్రతి ఫోన్ కు రేడియేషన్ ఒక్కో స్థాయిలో ఉంటుంది.

ఏ ఫోన్ రేడియేషన్ ఎంత ఉంటుంది అనే విషయంలో ఎవరికి పెద్దగా అవగాహన ఉండదనే చెప్పాలి. రేడియేషన్ అంటే ఏంటో కూడా తెలియనివారు ఉంటారనడంలో సందేహం అక్కర్లేదు.


రేడియేషన్ లేదా SAR వాల్యూ తప్పనిసరిగా తెలిసి ఉండాలి.

ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చాక ముందుగా చెక్ చేయాల్సింది రేడియేషన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఫోన్ కొనాలా? వద్దా? అని డిసైడ్ చేసుకోవాలి. కొన్ని స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు తమ యూజర్ మాన్యువల్ ల్లోనే SAR రేటింగ్ ఎంతో ప్రస్తావిస్తాయి. కొన్న స్మార్ట్ ఫోన్ బాక్సులోనే ఇది ఉంటుంది.
అంతేకాదు.. స్మార్ట్ ఫోన్ అధికారిక వెబ్ సైట్లో కూడా తమ ప్రొడక్టుకు సంబంధించి SAR వాల్యూ ఎంత ఉందో రివీల్ చేస్తాయి కూడా. సాధారణంగా ప్రతి ఫోన్ లో రేడియో ఫ్రిక్వెన్సీ ట్రాన్స్ మిటింగ్ డివైజ్ ఉంటుంది. దీని ద్వారా కొత్త స్థాయిలో రేడియేషన్ బయటకు రిలీజ్ అవుతుంది.

ఈ రేడియేషన్ కారణంగా ఆ ఫోన్ వాడేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాప కింద నీరులా ఆ రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతిస్తూ వస్తుంది. రేడియేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్టే. అసలు.. స్మార్ట్ ఫోన్లో రేడియేషన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోవాలని ఉందా? రేడియేషన్ లెవల్ మీ ఫోన్లలో ఎలా చెక్ చేయాలో ఇలా ఫాలో అవ్వండి.

SAR Value చెకింగ్ ఇలా :
* మీ స్మార్ట్ ఫోన్ Unlock చేయండి.
* మీ ఫోన్ Dialer Keypad ఓపెన్ చేయండి.
* ఇప్పుడు *#07# అని టైప్ చేయండి.
* మీ స్మార్ట్ ఫోన్ స్ర్కిన్‌పై SAR రేటింగ్ వాల్యూ కనిపిస్తుంది.
* రేడియేషన్ స్థాయి 1.6w/kg (Body, Head) కంటే తక్కువ స్థాయిలో ఉంటే పర్వాలేదు.
* మీ ఫోన్ వాడొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు.
* ఎక్కువ స్థాయిలో రేడియేషన్ ఉంటే మాత్రం తక్షణమే ఆ ఫోన్ వాడకం ఆపేయండి.


IMEI నెంబర్లు చెకింగ్ :
* IMEI నెంబర్లు సహా ఇతర విషయాలను కూడా చెక్ చేయొచ్చు.
* మీ డయలర్ ప్యాడ్ పై *#06# అని టైప్ చేయండి.
* స్మార్ట్ ఫోన్ స్ర్కిన్ పై ఆటోమాటిక్ గా IMEI నెంబర్లు కనిపిస్తాయి.

0 comments:

Post a Comment

Recent Posts