*✨ ఉపాధ్యాయులకు శిక్షణ*
★ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
★ 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ మండల, గ్రామ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నామని వెల్లడి.
★ *జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై ట్రైనింగ్ ఇస్తున్నామని వ్యాఖ్య.*
★ ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంగ్లీష్ నైపుణ్యం పిల్లలకు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
★ ఆంగ్ల భాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులు అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.36 శాతం మాత్రమే ఆంగ్ల భాష అభ్యసిస్తున్నారని వివారలను వెల్లడి.
★ తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాషను కూడా బోధిస్తామని, ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్ల ప్రదేశ్ అనడం సమంజసం కాదని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment