Friday, 8 November 2019

''కనెక్ట్‌ టు ఆంధ్రా'' వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ''కనెక్ట్‌ టు ఆంధ్రా'' వెబ్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం తదితర వివరాలన్ని ప్రజలకు అందుబాటులో వుండేట్లు చేయడమే కాకుండా పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ఈ వెబ్ పోర్టల్ పనిచేయనుంది.


దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ పోర్టల్ ను ఉపయోగించి మరింత సులభంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావోచ్చని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో కావాలని సీఎం పిలుపునిచ్చారు.

తమ తమ సొంత గ్రామాల్లో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడుతో సహా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చని సీఎం సూచించారు
కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్ ప్రారంభం తర్వాత ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు.

''రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి (లేదా) మీ నియోజకవర్గానికి (లేదా) మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి'' అని జగన్ పిలుపునిచ్చారు.


సచివాలయంలోని సీఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts