Saturday, 9 November 2019

ఏపీ ఇంగ్లీష్ మీడీయంలో మార్పులు...

ఏపీలో ఇంగ్లీష్ మీడీయం ప్రవేశపెట్టడడంపై దుమారం రేగిన నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేయడం వల్ల రానున్న రోజుల్లో తెలుగు కనుమరుగు అయ్యో ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీతో పాటు పలు ప్రజాసంఘాలు, తెలుగు పండితులతో పాటు ఇతర ప్రజాస్వామిక భాష వేత్తలు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అందోళన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తెలుగు మీడియం ప్రవేశపెట్టడడంపై మరోసారి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆందోళనపై కాస్త వెనక్కి తగ్గారు. దీంతో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకే ఇంగ్లీష్ తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకన్నారు
.

అయితే గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకటి నుండి ఎనిమిదివ తరగతి వరకు ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యాబోధన చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రతి ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని మార్చుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు.


ఇక సమీక్షలో భాగంగా ప్రతి స్కూళ్లో ఇంగ్లీష్ భాషకు సంబంధించి ల్యాబ్‌లు కూడ ఏర్పాటు చేయాలని చెప్పారు.

 ఇందుకోసం నవంబర్ 14 నుండి చేపట్టే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ల్యాబ్‌లను ప్రారంభించాలని చెప్పారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాల్లో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఒంగోలులో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts