Thursday, 21 November 2019

Teacher Award: టీచర్లకు అవార్డులు... రూ.1 లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్

Teacher Award: టీచర్లకు అవార్డులు... రూ.1 లక్ష విలువైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్


మీరు టీచరా? ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారా? రూ.1 లక్ష విలువైన అవార్డు గెలుచుకునే అవకాశమిది. ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తూ, రాణిస్తున్న టీచర్లకు రిలయెన్స్ ఫౌండేషన్ ప్రతీ ఏటా అవార్డులు అందిస్తోంది. సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్-CENTA, టీచర్స్ ప్రొఫెషనల్స్ ఒలంపియాడ్-TPO సంయుక్తంగా ఈ పురస్కారాలను అందించనుంది. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో 2019 డిసెంబర్ 14న ఈ కార్యక్రమం జరగనుంది. ఆసక్తిగల ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు 2019 నవంబర్ 25 చివరి తేదీ. సెంటా టీపీఓ మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో రెండు గంటల నిడివి గల పరీక్ష ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోని కామన్ టాపిక్‌లకు సంబంధించిన సబ్జెక్టుల ప్రశ్నలు ఉంటాయి.
ఆయా అంశాలను అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సెంటా టీపీఓలో విజేతలుగా నిలిచిన వారి అభిప్రాయం ప్రకారం... పరీక్షలో విజయం సాధించేందుకు ప్రత్యేకంగా సిద్ధం అవడం కంటే నిరంతరం బోధనాభ్యాసంలో ఉన్నవారి సామర్థ్యాలను పరీక్షించే విధంగానే ఉంటుంది.


బోధనను ఉత్తమమైన వృత్తిగా ఎంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు సెంటా టీపీఓ కట్టుబడి ఉంది. ఆ ఆసక్తిని గుర్తించడం నగదు బహుమతులతో ప్రోత్సహించడం లక్ష్యంగా సాగుతోంది.
— అంజలి, సెంటా వ్యవస్థాపకురాలు

సెంటా టీపీఓ పరీక్షకు 18 ఏళ్ల వయస్సు గల ఉపాధ్యాయులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ పాస్ కావాలి. స్కూల్ టీచర్లు, సప్లిమెంటరీ టీచర్లు, ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, కంటెంట్ క్రియేటర్లు, బీఈడీ/డీఈడీ విద్యార్థులు, బోధనాభ్యాసంపై ఆసక్తిగలవారు ఎవరైనా ఇందులో పాల్గొనొచ్చు. 1000 మందిని ఎంపిక చేసి రిలయెన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డులను అందిస్తారు. ఒక్కొక్కరికీ రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాన్ని అందిస్తారు. టీపీఓ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు పుస్తకానికి సహ రచయితగా ఉండే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ క్లాస్‌కు హాజరయ్యేందుకు అవకాశం లభించొచ్చు.
సెంటా టీపీఓకు 12 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డులతో పాటుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జి లాంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి. ప్రతీ ఏటా భారతదేశవ్యాప్తంగా 30,000 పైగా పాఠశాలల తరఫున ఉపాధ్యాయులు పోటీపడుతున్నారు. "సెంటా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది" అని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామానికి ప్రభుత్వ టీచర్ తోట శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన తెలుగు మీడియం ప్రైమరీ ట్రాక్ టాపర్. టీపీఓ 2018 జాతీయ ర్యాంక్ 129 సాధించారు. దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫోరంలో క్రికెట్ లెజెండ్ శ్రీ బ్రియన్ లారా ఆయన్ను సన్మానించారు. రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డును అందుకోవడంతో పాటుగా రూ. 25,000 నగదు, టీపీఓ సర్టిఫికెట్, సెంటా మైక్రో క్రెడెన్షియల్స్ అభ్యాసం చేసేందుకు 40% ఉపకార వేతనం సైతం ఆయన సొంతం చేసుకున్నారు. శ్రీనివాస్ విజయాలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు లభించింది.


ప్రైవేట్ స్కూల్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్‌కు చెందిన సౌమ్య మిట్టపల్లె సబ్జెక్ట్ కేటగిరీలో సీనియర్ సెకండరీ స్కూల్ ఇంగ్లిష్ విభాగంలో మూడో ర్యాంకును సాధించారు. సెంటా టీపీఓ 2018లో జాతీయ స్థాయిలో 377వ ర్యాంక్‌ను పొందారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డ్, టీపీఓ ధ్రువీకరణ పత్రాన్ని సొంతం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం team@centa.org, +91 9840240612, www.centa.org సంప్రదించండి.

0 comments:

Post a Comment

Recent Posts