ఏపీలో 762 మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టులు
ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. పోస్టుల వివరాలు.. * గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి/ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) ఖాళీల సంఖ్య: 762
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు, ఎంపిక విధానం.. ➦ సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ➦ రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 11.01.2020 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 31.01.2020 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది 30.01.2020
0 comments:
Post a Comment