Saturday, 18 January 2020

7870 SBI క్లర్క్ జాబ్స్. దరఖాస్తుకు ఆఖరి తేదీ: 26-01-2020.

7870 SBI క్లర్క్ జాబ్స్.  దరఖాస్తుకు ఆఖరి తేదీ: 26-01-2020.
ఏడాది ప్రారంభంలోనే ఎస్బిఐ నిరుద్యోగులకు ఓ తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా 7870 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఖాళీల విషయానికి వచ్చినట్లైతే ఒక్క హైదరాబాద్ రీజియన్ లోనే 375 పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్ ను జనవరి 2న ఎస్బిఐ విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేది జనవరి 26. డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎస్బిఐ ఎంపిక చేయనుంది. 2020 ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రిలిమినరీ, 2020 ఏప్రిల్ 19న మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. జూన్ లోగా నియామక ప్రక్రియ పూర్తవుతుంది. ఒకసారి ఎంపిక విధానాన్ని చూసినట్లైతే..

ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఎంపిక కావాలంటే మూడు దశల్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సిలబస్, ఏయే టాపిక్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


పరీక్ష సిలబస్, పరీక్ష విధానం :

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. 100 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. 3 సెక్షన్లకు 20 నిమిషాల చొప్పున కేటాయిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పుగా రాసిన ప్రతీ సమాధానానికి 0.25 మార్కుల్ని తగ్గిస్తారు. ఉన్న పోస్టుల కంటే 10 రెట్లు అంటే సుమారు 78,700 మందిని మెయిన్స్ ఎగ్జామ్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. 190 ప్రశ్నలకు 200 మార్కులు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. జనరల్ / ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 60 మార్కులు. జనరల్ / ఫైనాన్స్ అవేర్‌నెస్‌, జనరల్ ఇంగ్లీష్‌కు 35 నిమిషాల చొప్పున, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌కు 45 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. జనరల్ ఇంగ్లీష్ మినహాయించి అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. 1/4 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారిన ఫైనల్ సెలక్షన్‌కు ఎంపిక చేస్తారు. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటాయి.

సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మొత్తం ఖాళీలు: 7870

పోస్టులు: జూనియర్ అసోసియేట్

అర్హత: ఏదైనా డిగ్రీ

వయసు: 20-28 సంవత్సరాలు మించకూడదు

జీతం: నెలకు 13,075/-

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-01-2020

దరఖాస్తుకు ఆఖరి తేదీ: 26-01-2020

ఎంపిక: రాత పరీక్ష


0 comments:

Post a Comment

Recent Posts