Sunday, 19 January 2020

మున్సిపల్ ఎన్నికలకు ఓటర్ స్లిప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

మున్సిపల్ ఎన్నికలకు  ఓటర్ స్లిప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి...


ఈ నెల 22వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలామంది ఓటర్లు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదని టెన్షన్ పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఓటర్లకు సంబంధించిన ఓటర్ జాబితా విడుదలైంది. ఎన్నికలలో ఓటు వేసేవారు తప్పనిసరిగా ఓటర్ స్లిప్ ను కలిగి ఉండాలి. ఓటర్ స్లిప్స్ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఓటర్ స్లిప్ ను ఓటర్ ఐడీ నంబర్ ను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవాలనుకునేవారు 


https://tsec.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి download voter slip అనే లింక్ పై క్లిక్ చేసి జిల్లా పేరును, ఎపిక్ నంబర్ ను, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి search పై క్లిక్ చేస్తే ఓటర్ స్లిప్ వస్తుంది.

ఆ ఓటర్ స్లిప్ ను ప్రింట్ తీసుకొని ఓటు వేసే సమయంలో తీసుకొనివెళ్లాలి. ఓటర్ స్లిప్పుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉన్నచోటు నుండే డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఓటర్ స్లిప్పులు లేని వారు ఓటర్ స్లిప్ లేదని కంగారు పడకుండా వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మన ఓటర్ స్లిప్ మాత్రమే కాకుండా మన వార్డుకు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వార్డుకు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవడానికి
  https://tsec.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి download ulb ward wise electoral rolls పై క్లిక్ చేయాలి. ఆ తరువాత జిల్లా పేరు, వార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి get data పై క్లిక్ చేసి తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఒక భాషను ఎంచుకొని వార్డు ఓటర్ల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా కుటుంబంలోని సభ్యుల జాబితాను ప్రింట్ తీసుకోవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts