Saturday, 18 January 2020

తెలంగాణ సార్విత్రిక విద్య ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ,ఇంటర్మీడియట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ,ఇంటర్మీడియట్‌ నోటిఫికేషన్‌ విడుదల


            హైదరాబాద్ : 2019-20 సంవత్సవారానికి గాను తెలంగాణ సార్విత్రిక విద్య(ఓపెన్‌ స్కూల్‌) ఎస్సెస్సీ,ఇంటర్మీడియట్‌ స్పెషల్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారని జిల్లా విద్యాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారం సమర్పించేందుకు,ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఈనెల 18 నుంచి 28 వరకు గడువుందన్నారు.ఎస్సెస్సీ,ఇంటర్మీడియట్‌ స్పెషల్‌ అడ్మిషన్‌ ప్రవేశం పొంద లాను కునేవారు అభ్యాసకులు దరఖాస్తు ఫారంను ఓపెన్‌ స్కూల్‌స్టడీ సెంటర్‌ సెంటర్‌ను, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌ సైట్‌ 


 www.telanganaopenschool.org ద్వారా పూర్తి చేసి డెబిట్‌/క్రెడిట్‌ కార్డు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లేదా టీఎస్‌ ఆన్‌లైన్‌/ఏపీ/మీసేవ ద్వారా ఫీజు చెల్లించాని తెలిపారు.


ఫీజుల వివరాలు ఇలా..
*ఎస్సెస్సీకి అడ్మిషన్‌ ఫీజు జనరల్‌ (పురుషులకు) రూ.1100, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు,మహిళలకు రూ.700, *ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌ ఫీజు జనరల్‌ (పురుషులకు) రూ.1300, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు రూ.1000, *లేటు ఫీజుతో (రూ.100) ఎస్సెస్సీకి, ఇంటర్మీడియట్‌కి (రూ.200) మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

Click here to visit Official Website

0 comments:

Post a Comment

Recent Posts