Thursday 27 February 2020

రాష్ట్రంలో 42 విలేజ్‌ కోర్టులు గ్రామ న్యాయాలయాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో 42 విలేజ్‌ కోర్టులు
గ్రామ న్యాయాలయాలకు  నోటిఫికేషన్
రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్‌ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరులో 1, తూర్పు గోదావరిలో 1, గుంటూరు జిల్లాలో 12, కృష్ణాలో 2, కర్నూలు జిల్లాలో 3.. ప్రకాశం జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరిలో 2, వైఎస్సార్‌ కడప జిల్లాలో 2 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేసింది.


ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి లేదా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌ క్లాస్‌ క్యాడర్‌) అధికారి గ్రామ న్యాయాధికారిగా ఉంటారు.
ప్రతి గ్రామ న్యాయాలయానికి ఒక సూపరింటెండెంట్, ఒక స్టెనోగ్రాఫర్,కొక జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉంటారు. జీతాలు ఇతర ఖర్చుల కింద ఒక్కో గ్రామ న్యాయాలయానికి రూ.27.60 లక్షలు చెల్లిస్తారు. ఫర్నిచర్‌ కొనుగోలు, లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.2.10 కోట్లు ఇస్తారు. గ్రామ న్యాయాలయాల చట్టం-2008 కింద వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

0 comments:

Post a Comment

Recent Posts