Saturday, 29 February 2020

AP Emset 2020 Schedule Released

ఏపీ ఎంసెట్ షెడ్యూలు విడుదల..ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు!

ఏపీ ఎంసెట్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి 23 వరకూ ఇంజనీరింగ్, 23, 24 తేదీల్లో అగ్రికల్చర్, 22, 23 తేదీల్లో రెండు స్ట్రీమ్ లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ వీ రవీంద్ర వెల్లడించారు. సెట్ నిర్వహణ వర్శిటీ అయిన కాకినాడలోని జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఈ నెల 29 నుంచి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపారు. మార్చి 29 దరఖాస్తుల సమర్పణకు తుది గడువని తెలిపిన ఆయన, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 5 వరకూ, రూ. 1000 రుసుముతో 10వ తేదీ వరకూ, రూ. 5 వేల రుసుముతో 15వ తేదీ వరకూ, రూ. 10 వేల ఆలస్య రుసుమును చెల్లించి 19 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.
గత సంవత్సరం అమలు చేసిన నిబంధనలనే ఈ సంవత్సరం కూడా అమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలు కూడా మార్చలేదని, అయితే, అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ ఉన్న కారణంగా ప్రకాశం జిల్లా చిమకుర్తి, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొత్త సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.హైదరాబాద్ లో మూడు పరీక్షా కేంద్రాలు ఉంటాయని తెలిపారు.

విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశామని రవీంద్ర వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రతి రోజూ రెండు సెషన్లుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలు రెండింటికీ హాజరు కావాలని భావించే వారు రూ. 1000 చెల్లించాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు


 h.//sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
AP Emsett Schedule Released
 AP Emcet Exam Schedule Released.  The two streams will be tested from April 20 to 23 in Engineering, Agriculture on April 23 and April 24, said Emcet Convener Vee Ravindra.  It is said that the tests will be conducted under the auspices of JNTU, Kakinada, a set management variant.

 Applications will be received from the 29th of this month.  He said the deadline for submission of applications on March 29 was Rs.  500 with a late fee till April 5, Rs.  1000 till the 10th and Rs.  Until the 15th of the Rs.  Applications can be made up to 19, paying a late fee of 10 thousand.
 He clarified that the same rules that were implemented last year will be implemented this year as well.  The exam centers have not been changed, however, as the number of candidates is growing, Prakasam district's Chimakurti, Krishna district, Thiruvarur and Kurnool district have set up new centers in Hyderabad.

 Ravindra said call centers have also been set up to cater to students' suspicions.  The hall tickets can be downloaded from April 16, and there will be two sessions of computer-based exams each day, while those who wish to attend both engineering and agriculture exams will get Rs.  It was made clear that 1000 should be paid.  For further details please visit the website.

/sche.ap.gov.in/APSCHEHome.aspx.

0 comments:

Post a Comment

Recent Posts