Thursday, 27 February 2020

Gram and Ward Secretariat Employees as Tenth and Inter Exams Investigators ..

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్లుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు…మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సంబంధిత శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్భందీగా చేయాలని ఆయన ఆర్ఐవోలతో సూచించారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర్లో ఉన్న జిరాక్స్ షాపులను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.



పరీక్షలు జరుగుతున్నప్పడు చీఫ్ సూపర్ వైజర్ వద్ద మినహా..మిగతా వారందరీ వద్ద ఫోన్లు ఉపయోగించడాన్ని నిషేదిస్తామన్నారు.

ఈ ఏడాది పరీక్ష కేంద్రాల సమాచారం కోసం యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఇంటర్‌లో ఈసారి గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

0 comments:

Post a Comment

Recent Posts