రేపు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
ప్రధాని మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావ్యాప్తిపై విధించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై ప్రధాని స్పష్టతనివ్వనున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment