Sunday, 12 April 2020

అంతర్జాతీయ అంశాలు : 2020 (జనవరి - ఫిబ్రవరి - మార్చి )

అంతర్జాతీయ అంశాలు : 2020 (జనవరి - ఫిబ్రవరి - మార్చి )



ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టేవారికి ‘ఎర్త్‌షాట్‌’ పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు ప్రకటించిన వారు ఎవరు ? బ్రిటన్‌ రాకుమారుడు విలియమ్‌

ఇటీవల వార్తల్లో నిలిచిన ‘కాలాపానీ’ ప్రాంతం ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా ఉంది ? భారత్ - నేపాల్

రోహింగ్యాలకు పునరావాసం కల్పించేందుకు ‘భసన్‌ఛార్‌’ అనే పునరావాస కేంద్రాన్ని నిర్మించిన దేశం ఏది ? బంగ్లాదేశ్

‘కరోనా’ అనే వైరస్‌ ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో తొలిసారి వెలుగు చూసింది ? చైనా

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ విడుదల చేసిన ‘కరప్షన్‌ పెర్‌సెప్షన్‌ ఇండెక్స్‌’ (సీపీఐ) - 2020లో ప్రధమ స్థానంలో నిలిచిన దేశం ఏది ? డెన్మార్క్‌, న్యూజిలాండ్‌

ప్రపంచంలోనే అత్యంత చిన్న బంగారు నాణేన్ని ఏ దేశం తయారుచేసింది ? స్విట్జర్లాండ్‌.

యుఎన్‌సిటిఎడి(UNCTAD ) నివేదిక ప్రకారం 2019 లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అత్యధికంగా పొందిన దేశం ఏది ? అమెరికా



ప్రపంచ ఆర్థిక వేదిక మరియు ఇతర భాగస్వామ్య సంస్థలు ఇటీవల ‘1టీ. ఓఆర్‌జీ’ అనే సంస్థను ప్రారంభించాయి, అయితే దీని ఉద్దేశ్యం ఏమిటి ? ప్రపంచవ్యాప్తంగా లక్ష కోట్ల చెట్ల పెంచడం

తైవాన్‌ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు ? తా యింగ్‌ వెన్‌

కరోనా వైరస్‌ కారణంగా చైనా వెలుపల తొలి మరణం ఏ దేశంలో నమోదైంది ? ఫిలిప్పీన్స్‌

ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్‌ ఏ తేదీన అధికారికంగా వేరుపడింది ? జనవరి 31,2020

మిడతల సమస్యపై పోరుకు ఇటీవల జాతీయ ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన భారత పొరుగు దేశం ఏది ? పాకిస్తాన్

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఇటీవల ఎన్ని దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (International Religious Freedom Alliance (IRF Alliance))గా ఏర్పాటయ్యాయి ? 27 దేశాలు

భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ (రాయబారి)గా ఎవరు నియమితులయ్యారు.? సర్‌ ఫిలిప్‌ బార్టన్‌

కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ఇటీవల ఏ దేశంలో పది రోజుల్లోనే ఓ వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టి వైద్య సేవలు ప్రారంభించారు ? చైనా

ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఏపేరు పెట్టింది ? ‘కొవిడ్‌-19’

ఈ క్రింది ఏ పక్షిని ‘యుఎన్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ జాతుల (సిఎంఎస్) (సిఓపి 13) (mascot of UN Convention of Conservation of Migratory Species (CMS) (COP 13)) యొక్క చిహ్నం’గా ప్రకటించారు ? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.? అష్రఫ్‌ ఘనీ

'బీస్ట్' అనేది ఈ క్రింది ఏ దేశాధ్యక్షుడు ప్రయాణించే కారు ? అమెరికా

ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించేవారికి ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) వంతున రెండు పురస్కారాలు ఏటా అందజేస్తామని ఇటీవల ఏ దేశం ప్రకటించింది. ? స్వీడన్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 25, 2020న అమెరికా మరియు భారతదేశాల మధ్య సుమారు ఎన్ని కోట్ల రూపాయల రక్షణ ఒప్పందాలు జరిగాయి ? రూ. 21500 కోట్లు

బ్రిటన్‌ నూతన అటార్నీ జనరల్‌ (ఏజీ)గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు ? సుయెల్లా బ్రేవర్‌మాన్‌

ఇటీవల మృతిచెందిన హోస్నీ ముబారక్‌ ఏ దేశ మాజీ అధ్యక్షుడు ? ఈజిప్టు

చతుర్భుజ కూటమిలో అమెరికా మరియు భారత్’తో పాటు ఏ రెండు దేశాలు భాగస్వాములు ? ఆస్ట్రేలియా మరియు జపాన్

ఇటీవల మృతిచెందిన జేవియర్ పెరెజ్ డి క్యూల్లార్(Javier Perez de Cuellar) ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ చీఫ్'గా పనిచేసారు ? ఐక్యరాజ్యసమితి

ప్రగ్యాన్ కాన్క్లేవ్ 2020(PRAGYAN CONCLAVE 2020 ) అనేది ఏ భద్రతా దళం నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్? ఇండియన్ ఆర్మీ

సింగపూర్‌కు చెందిన డేరెన్ టాంగ్(Daren Tang) ఈ క్రింది ఏ సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యాడు? అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ

ఈ క్రింది ఏ దేశంలో ఒకే రోజు ఇద్దరు నేతలు అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసి సంచలనం సృస్టించారు ? అఫ్గానిస్థాన్‌

ప్రపంచంలోని మొట్టమొదటి 'డార్క్ స్కై నేషన్' గా ప్రకటించబడ్డ దేశం ఏది ? Island of Niue

ఇటీవల షేక్ ముజిబర్ రెహ్మాన్ యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడ్డాయి , అయితే ఇతను ఏ దేశానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ? బంగ్లాదేశ్

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్‌ కంట్రీ) ఏది ? ఫిన్‌లాండ్

ఇటీవల మృతిచెందిన ‘కెన్నీ రోజర్స్’ ఈ క్రింది ఏ దేశానికి చెందిన ప్రముఖ గాయకుడు ? అమెరికా

మలేసియా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ? ముహయిద్దీన్‌ యస్సిన్‌

ప్రపంచంలోనే ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం ఏది ? లక్సెంబర్గ్‌

అమెరికా మరియు తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం ఏ తేదీన జరిగింది ? ఫిబ్రవరి 29,2020

ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి ఎంత మొత్తంతో అత్యవసర నిధిని ప్రకటించింది. ? 2 బిలియన్‌ డాలర్లు

కోవిడ్ -19 కారణంగా ఇటీవల చనిపోయిన ‘మారియా టెరీసా’ ఏ దేశ యువరాణి ? స్పెయిన్‌

గ్రీస్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ ఎవరు ? జస్టిస్‌ కాటెరినా సాకెల్లోపౌలో

కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఎంత ప్యాకేజీని ప్రకటించింది. ? 650 కోట్ల డాలర్ల

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) విడుదల చేసిన జెండర్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్(Social Norms Index report) నివేదిక ప్రకారం, ఎన్ని దేశాలు లింగ సమానత్వాన్ని సాధించాయి ? 0 ( ప్రపంచంలో ఏ దేశం కూడా లింగ సమానత్వాన్ని సాధించలేదు )

To join Whats app Click here
To joinTelegram Channel Click here

0 comments:

Post a Comment

Recent Posts