ఏపీలో 226కు చేరిన పాజిటివ్ కేసులు.. కర్నూల్‌లో ఒక్కసారిగా..
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న అనగా శనివారం రాత్రి 9గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మీడియా బులెటిన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరుకుంది. ఒంగోలులో 02, చిత్తూరు 07, కర్నూల్ 23, నెల్లూరు 02 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే.. కర్నూల్ జిల్లాలో నిన్న మొన్నటి వరకూ రెండు మూడు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే మొదట ఒకరిద్దరికే పాజిటివ్ అని తేలగా.. తాజాగా రిపోర్టులు రాగా ఆ కేసులు 23కు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27.
జిల్లాల వారిగా కేసులు వివరాలిలా..
అనంతపురం-03
చిత్తూరు -17
పశ్చిమగోదావరి-11
గుంటూరు-30
కడప - 23
క్రిష్ణా -28
కర్నూలు -27
నెల్లూరు-34
ప్రకాశం-23
శ్రీకాకుళం -00
విశాఖపట్నం- 15
విజయనగరం -0
తూర్పుగోదావరి-15
మొత్తం కేసుల సంఖ్య : 226
ఆ రెండు జిల్లాల్లో...
నెల్లూరు జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు (34) నమోదయ్యాయి. ఈ జిల్లా తర్వాత గుంటూరు జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటి వరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అసలు ఆ రెండు జిల్లాల్లో అధికారులు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు..? కేసులు నమోదు కాకపోవడానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. ఆ రెండు జిల్లాలో ఏమేం చర్యలు తీసుకుంటున్నారో ఆ మోడల్‌నే పాటించాలని మిగతా జిల్లాల అధికారులు కూడా సిద్ధమవుతున్నారు.
0 comments:
Post a Comment