మహిళల జన్‌ధన్ ఖాతాలో రూ.500 జమ ఖాతాల్లో నగదు జమ
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్ యోజన పథకం కింద జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.500 చొప్పున ఈ నెల నుంచి మూడునెలలపాటు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ డబ్బు గురువారం ఖాతాల్లో జమ అయ్యిందని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్బులను బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడానికి కొన్ని సూచనలు చేసింది. నిర్ణయించిన తేదీల్లో డబ్బులు డ్రా చేసుకోకుంటే తొమ్మిదో తేదీ తర్వాత బ్యాంకు పనిచేసేరోజుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు నగదు పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు. నగదు తీసుకొనే తేదీలు ఖాతాలోని నగదు చివరి అంకె తీసుకొనే తేదీ 0 లేదా 1 03.04.2020
2 లేదా 3 04.04.2020
4 లేదా 5 07.04.2020
6 లేదా 7 08.04.2020
8 లేదా 9 09.04.2020
లబ్ధిదారులకు నిర్దేశించిన తేదీల్లో నగదు తీసుకోకపోతే ఈ నెల 9వ తేదీ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు.
ఏటీఎంలలో, గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద కూడా నగదును తీసుకుకోవచ్ఛు
0 comments:
Post a Comment