Thursday, 2 April 2020

ఫేక్ న్యూస్' గుర్తించండిలా..టీఎస్ సర్కార్ వెబ్ సైట్

'ఫేక్ న్యూస్' గుర్తించండిలా..టీఎస్ సర్కార్ వెబ్ సైట్


సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఫేక్ న్యూస్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఫేక్ వార్తల వల్ల చాలా నష్టాలూ జరుగుతున్నాయి. ఎవరిదైనా ప్రతిష్టను దెబ్బ తీయడానికో, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికో కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. కొన్నిసార్లు అవి ఫేక్ న్యూస్ అని తెలిసినా తమ భావజాలానికి అనువుగా ఉందన్న కారణంతో కావాలని కొందరు ఆ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ నమ్మి ప్రజలు మోసపోవడంతో పాటు ఎదుటివాళ్లు పన్నే వలలోనూ చిక్కుకుంటారు.


ఇలాంటి వార్తల వల్ల ఇంటర్నెట్ లో ఉండే అసలైన సమాచారాన్ని కూడా అనుమానించాల్సిన వస్తుంది. ఒక్కోసారి ఈ ఫేక్ వార్తలు హత్యలకూ దారి తీస్తున్నాయి. ఫేక్ వార్తలు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల్లో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దూకింది. తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఫాక్ట్ చెక్ .
(https://factcheck.telangana.gov.in/) అనే ఓ వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఏదైనా ఫేక్ వార్త వైరల్ అయితే.. ఈ సైట్ గుర్తిస్తుంది.మీకు ఏదైనా సమాచారంపై అనుమానం ఉంటే ఈ సైట్ లో అప్లోడ్ చేయవచ్చు. ఈ సైట్ ఉద్యోగులు మీరు పంపిన సమాచారాన్ని చెక్ చేసి చెపుతారు.

0 comments:

Post a Comment

Recent Posts